Home న్యూస్ హిందీ గడ్డ మీద 50 ఔట్…..మామూలు విద్వంసం కాదిది!!

హిందీ గడ్డ మీద 50 ఔట్…..మామూలు విద్వంసం కాదిది!!

0

సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ ను, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో, ఓవర్సీస్ లో…

కుమ్మేసినట్లే హిందీలో కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించింది, స్టార్ కాస్ట్ గురించి అక్కడ ఎవ్వరికీ పెద్దగా తెలియక పోయినా కూడా సినిమా మౌత్ టాక్ వలన స్లో అండ్ స్టడీగా వసూళ్ళని సొంతం చేసుకుంటూ పరుగును 4 వారాలకు పైగా కొనసాగించిన హనుమాన్ మూవీ ఇప్పుడు అక్కడ…

HanuMan Movie 30 Days Total WW Collections!

మరో బిగ్ మైలురాయిని అధిగమించింది… 30 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా హిందీలో 50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది… ఓ చిన్న సినిమా, ఎవ్వరికీ అస్సలు తెలియని స్టార్ కాస్ట్ తో వచ్చిన ఈ సినిమాకి ఇలాంటి కలెక్షన్స్ అక్కడ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి.

లాంగ్ రన్ లో 50 కోట్ల మార్క్ ని అందుకుని సౌత్ నుండి అక్కడ డబ్ అయిన మూవీస్ లో ఈ మైలురాయిని అందుకున్న కొన్ని సినిమాల్లో హనుమాన్ ఒకటిగా చేరగా పార్ట్ 2 ఎప్పుడు వచ్చినా కూడా తెలుగు తో పాటు హిందీలో కూడా మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

HanuMan Movie 29 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here