టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram) సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయినా కూడా ఉన్నంతలో లాంగ్ రన్ లో బాగానే పెర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం…
సినిమా బ్రేక్ ఈవెన్ ని అయితే అందుకోలేక పోయింది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వగా నెట్ ఫ్లిక్స్ లో సినిమాకి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉంది, సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేయడం కలిసి రావడంతో…
ఇతర భాషల వాళ్ళు కూడా సినిమాను ఎగబడి చూస్తూ ఉండగా సినిమాకి మొదటి వీకెండ్ లోనే నెట్ ఫ్లిక్స్ లోనే ఏకంగా 3.9 మిలియన్ ఇంప్రెషన్స్ ను సొంతం చేసుకోగా రీజనల్ మూవీస్ పరంగా ఇవి సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి..పాన్ ఇండియా మూవీ అయిన సలార్(Salaar Movie) మొదటి వీకెండ్ లో సౌత్ భాషల్లో…
3.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు గుంటూరు కారం రిమార్కబుల్ వ్యూవర్ షిప్ ను డిజిటల్ లో సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో పర్వాలేదు అనిపించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ లో మాత్రం ఎక్స్ లెంట్ గా దూసుకు పోతూ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం.