Home న్యూస్ గాడ్జిల్లా X కాంగ్2….ట్రైలర్ చూశారా….అదిరిపోయింది…ఊచకోత ఖాయం!

గాడ్జిల్లా X కాంగ్2….ట్రైలర్ చూశారా….అదిరిపోయింది…ఊచకోత ఖాయం!

0

రీసెంట్ టైంలో హాలీవుడ్ మూవీస్ లో భారీ బ్లాక్ బస్టర్ లు తక్కువగానే వచ్చాయి, మార్వేల్ సిరీస్ ల నుండి భారీ హిట్స్ ఒకప్పుడు వచ్చేవి కానీ రీసెంట్ టైంలో వాళ్ళ నుండి వచ్చే సినిమాలు కూడా బిలో పార్ ఉంటూ వస్తు ఉండగా ఈ ఇయర్ లో హాలీవుడ్ నుండి కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కానుండగా వాటిలో కోవిడ్ టైంలో…

బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన గాడ్జిల్లా X కాంగ్(Godzilla x Kong Movie) కి సీక్వెల్ గా ఇప్పుడు గాడ్జిల్లా X కాంగ్2(Godzilla x Kong: The New Empire) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా మార్చ్ 29న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా లేటెస్ట్ అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా….

ట్రైలర్ చూస్తుంటే వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది, ఇండియాలో కూడా ఈ సినిమా కి సాలిడ్ గా ఫ్యాన్స్ ఉండటంతో ఇక్కడ కూడా దుమ్ము లేపడం ఖాయం, ట్రైలర్ లో ఇటు కాంగ్ కి అటు గాడ్జిల్లాకి తమ లానే ఉండే మరో విలన్స్ తో పోటి పడాల్సి వస్తుంది…. 

గాడ్జిల్లాకి కాంగ్ కి ఒకరంటే ఒకరికి పడకపోయినా అందరినీ కాపాడటానికి ఇద్దరు ఏకం అయ్యి విలన్స్ తో ఎలా పోరాడారు అన్నది కథగా ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది, ఔట్ అండ్ ఔట్ భారీ విజువల్ వండర్ లా అనిపిస్తున్న ఈ ట్రైలర్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుంది అని చెప్పొచ్చు…

గాడ్జిల్లా X కాంగ్ 2021  కోవిడ్ టైంలో థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా కోవిడ్ ఇంపాక్ట్ వలన లాంగ్ రన్ ను ఎంజాయ్ చేయలేక పోయింది కానీ మొత్తం మీద 46.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగా రాబోతున్న గాడ్జిల్లా X కాంగ్2 ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here