Home న్యూస్ ఓయ్ రీ రిలీజ్ కలెక్షన్స్…ఇది ఊహకందని భీభత్సం!!

ఓయ్ రీ రిలీజ్ కలెక్షన్స్…ఇది ఊహకందని భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సిద్ధార్థ్(Siddharth) నటించిన ఓయ్ మూవీ(OYE Movie Re Release Collections) రీసెంట్ గా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి ఊహకందని రేంజ్ లో సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…

రీసెంట్ టైంలో రీ రిలీజ్ మూవీస్ కి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రావడం లేదు, కానీ ఓయ్ సినిమా విషయానికి వస్తే మాత్రం సినిమా సాంగ్స్ కి ఉన్న ఎక్స్ లెంట్ రిపీట్ వాల్యూ వలన జస్ట్ సాంగ్స్ కోసమే భారీ ఎత్తున జనాలు థియేటర్స్ కి వెళ్ళగా రీ రిలీజ్ డే లో సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి…

సినిమాకి హైదరాబాదు లో ట్రాక్ చేసిన గ్రాస్ 65 లక్షల దాకా గ్రాస్ బుకింగ్స్ జరగగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ సినిమా సొంతం చేసుకుంది… ఇక టోటల్ గా ఇండియాలో సినిమాకి 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుందని అంచనా….

ఈ రేంజ్ లో వసూళ్లు ఒక యావరేజ్ మూవీకి 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ తగ్గినా కూడా సడెన్ గా ఇలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. వాలెంటైన్స్ డే రోజున మిగిలిన కొత్త పాత అన్ని సినిమాల లోకి హైయెస్ట్ కలెక్షన్స్ ఈ సినిమాకే సొంతం అవ్వడం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here