బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్(Varun Tej) రీసెంట్ టైంలో బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో తన మార్కెట్ ను భారీగా కోల్పోయాడు… ఒక టైంలో ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ లాంటి హిట్స్ తో మంచి జోరు మీద ఉండగా మీడియం రేంజ్ హీరోలలో ప్రామిసింగ్ హీరోగా అనిపించగా మల్టీ స్టారర్ మూవీస్ అయిన F2, F3 సినిమాలతో కూడా రచ్చ చేశాడు.
కానీ తర్వాత ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ రూట్ లో వెళ్ళడం స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్ కి వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ కలిగించే రిజల్ట్ లు సొంతం అవ్వడం స్టార్ట్ అవ్వగా రీసెంట్ గా చేసిన గని మరియు గాండీవధదారి అర్జున లాంటి సినిమాలు భారీ డిసాస్టర్ లు గా నిలవగా తన మార్కెట్ మీద గట్టి ఇంపాక్ట్ పడింది.
ఇది వరకు తన మార్కెట్ రేంజ్ 25 కోట్లకు పైగా ఉండగా ఇప్పుడు బిజినెస్ కి భారీగా గండి పడినట్లు అయింది. తన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) కేవలం 17 కోట్ల రేంజ్ లోనే వాల్యూ బిజినెస్ ను మాత్రమె అందుకుంది. ఒకసారి వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#VarunTej Recent Movies Total Business(Solo)
👉#OperationValentine – 17CR*****
👉#GandeevadhariArjuna – 17CR
👉#Ghani – 25.30CR
👉#GaddalaKondaGanesh – 24.25CR
👉#Antariksham – 19CR
👉#Tholiprema – 23CR~
గద్దలకొండ గణేష్, గని సినిమాల బిజినెస్ లు 25 కోట్ల మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఆ రేంజ్ తగ్గిపోయి 17 కోట్ల రేంజ్ కి పడిపోయింది. ఇలాంటి టైంలో ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో వరుణ్ తేజ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇప్పుడు.