బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న మాచో స్టార్ గోపీచంద్(Gopichand), అప్పుడెప్పుడో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టగా ఆ సినిమా హిట్ తర్వాత ఆల్ మోస్ట్ 10 ఏళ్లకి ఆడియన్స్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న తన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…
సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న గోపీచంద్ ప్రమోషన్స్ లో భాగంగా తన ప్రీవియస్ మూవీస్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ని తీశారు, ఆ సినిమాలు ఆ టైం కన్నా చాలా ముందు టైంకి సరిపడా కథతో రాగా ఆ టైంకి ఆడియన్స్ కి ఉన్న టేస్ట్ కి అంచనాలను అందుకోలేక పోయాయి కదా….
అని అడిగిన ప్రశ్నకి గోపీచంద్ జవాబు చెబుతూ ఆ టైంకి ఆ కథలు కొత్తగా అనిపించినా ఆడియన్స్ అంచనాలను అందుకోలేదని కానీ అవే కథలు కోవిడ్ తర్వాత మారిన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు ఇప్పుడు రిలీజ్ అయ్యి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఆ సినిమాలు నిలిచేవని చెప్పారు…ఆ సినిమాలు మరేవో కాదు….
అప్పట్లో బాంబే బ్లడ్ గ్రూప్ నేపధ్యంలో ఆల్ మోస్ట్ ఒకే డ్రెస్ పై షూటింగ్ చేసిన ఒక్కడున్నాడు మూవీ అలాగే ట్రెజర్ హంట్ నేపధ్యంలో వచ్చిన సాహసం సినిమాలు ఇప్పుడు కనుక వచ్చి ఉంటే కచ్చితంగా భారీ విజయాలను నమోదు చేసి ఉండేవని చెప్పుకొచ్చాడు గోపీచంద్… మరి ఇప్పుడు ఎందుకని ఇలాంటి…
కాన్సెప్ట్ మూవీస్ చేయడం లేదని అడిగిన ప్రశ్నకి అలాంటి కథలు తక్కువగా వస్తున్నాయని, కానీ డైరెక్టర్ ఆ కథలను హ్యాండిల్ చేస్తారు అన్న నమ్మకం కలగడం లేదని అలా అనిపించిన జోరు కచ్చితంగా అలాంటి కథలను చేస్తానని చెప్పుకొచ్చారు గోపీచంద్.
ఇప్పుడు భీమా సినిమా కూడా కచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అన్న నమ్మకంతో ఉన్న గోపీచంద్ ఈ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి ఇప్పుడు.