లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి తీవ్రమైన ట్రోల్స్ ని ఫేస్ చేసి భారీ డిసాస్టర్ మూవీగా నిలిచిన సినిమా ఆదిపురుష్(Adi Purush Movie) రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) మెయిన్ లీడ్ లో రామాయణ కథతో తెరకెక్కిన ఈ సినిమా మొదలు అయినప్పుడు…
సినిమా మీద అంచనాలు స్కై హై రేంజ్ లో ఉండగా టీసర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అంచనాలు తప్పి నాసిరకంగా ఉన్న గ్రాఫిక్స్ తో అంచనాలు తప్పగా ట్రైలర్ కి ఎదో మార్పులు చేర్పులు చేశామని చెప్పి సినిమాను రిలీజ్ చేయగా భారీ ఓపెనింగ్స్ వచ్చినా కూడా విపరీతమైన ట్రోల్స్ ను ఫేస్ చేసి ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది సినిమా…
ఇలా ట్రోల్ అవుతామని ముందే ప్రభాస్ కి తెలుసునని, డైరెక్టర్ కి చెప్పినా వినలేదు అంటూ ఒకప్పుడు హనుమంతుడి రోల్స్ తో ఫేమస్ అయిన విందూ ధారా సింగ్ ఆదిపురుష్ సినిమా మీద కామెంట్ చేశారు….ఇప్పటి ఆడియన్స్ కి రామాయణాన్ని చెప్పాలి అనుకోవడం మంచిదే కాని చెప్పిన విధానం మాత్రం చాలా తప్పుగా చెప్పారని ఓం రౌత్ ని తప్పు పట్టారు…
అలాగే సినిమా హీరో అలాగే నటులు కూడా డైలాగ్స్ కొన్ని బాలేవని జనాలకు అవి అర్ధం కావు మార్చాలని చెప్పారని, అలాగే ఫ్రాఫిక్స్ క్వాలిటీ బాలేవని చెప్పారని, ప్రభాస్ కూడా చెప్పినా డైరెక్టర్ అలాగే స్టోరీ రైటర్ వినకుండా తమకి నచ్చింది తీశారని చెప్పుకొచ్చారు….
దాని వలనే ఆదిపురుష్ సినిమా అంచనాలను అందుకోలేక పోయిందని అన్నారు…. టీసర్ రిలీజ్ టైం కే సోషల్ మీడియాలో ఈ విషయాలు అన్నీ ఫ్యాన్స్ తో సహా ట్రోల్ చేసి ట్రెండ్ చేసినా టీం పెద్దగా పట్టించుకోలేదు….అందుకే రికార్డులు తిరగరాస్తుంది అనుకున్న ఆదిపురుష్ ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది…
ఆదిపురుష్ తో పోల్చితే చాలా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్(HanuMan Movie) దేవుళ్ళని ఎలా చూపించాలో, గ్రాఫిక్స్ ని పరిమిత బడ్జెట్ లో కూడా ఎలా వాడాలో చూపించి భారీ సక్సెస్ గా నిలిచింది, ఆదిపురుష్ విషయంలో కూడా ఇదే జరిగి ఉంటే కచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని నమోదు చేసి ఉండేదని చెప్పొచ్చు.