Home గాసిప్స్ ఎన్టీఆర్- 100….హృతిక్-100….క్రేజీ మూవీ…బాక్స్ ఆఫీస్ రచ్చ ఖాయం!

ఎన్టీఆర్- 100….హృతిక్-100….క్రేజీ మూవీ…బాక్స్ ఆఫీస్ రచ్చ ఖాయం!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ల క్రేజీ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ వార్2(War 2 Movie) మీద అంచనాలు సాలిడ్ గా ఉన్న విషయం తెలిసిందే…. బాలీవుడ్ లో ఎన్టీఆర్ మొదటి సారిగా నటించబోతున్న ఈ సినిమా మీద…

టాలీవుడ్ తో పాటు టోటల్ ఇండియా వైడ్ గా క్రేజ్ సాలిడ్ గా ఏర్పడగా రీసెంట్ గా సినిమా షూటింగ్ మొదలు అవ్వగా ముందుగా షూటింగ్ లో హృతిక్ రోషన్ పాల్గొనగా… త్వరలో ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఇక సినిమా కోసం ఇద్దరు హీరోలు కూడా భారీగా బల్క్ డేట్స్ ఇచ్చారట…

బాలీవుడ్ వార్తల ప్రకారం ఎన్టీఆర్ ఏకంగా 100 రోజుల కాల్ షీట్స్ ఈ సినిమా కోసం ఇవ్వగా హృతిక్ రోషన్ కూడా 100 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట. ఇద్దరు హీరోలకి సమంగా వర్కింగ్ డేస్ ఉండటంతో రెండు పాత్రలకు సమమైన ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు… బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ మూవీ…

అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…ఇప్పుడు ఎన్టీఆర్ ఎంటర్ అవ్వడంతో భారీ పాన్ ఇండియా మూవీగా మారిన వార్2 అంచనాలకు తగ్గట్లు రూపొందితే కనుక బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ లో కూడా సంచలన రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here