బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో పేరుకు చిన్న సినిమానే అయినా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా గా రజాకార్(Razakar Movie Review Telugu) అని చెప్పుకోవాలి….. యదార్ధ సంఘటనల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసు కుందాం పదండీ…
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా హైదరాబాదును మాత్రం నైజాం సంస్థానం పాలిస్తున్న రోజుల్లో….రజాకార్ వ్యవస్థ ద్వారా ప్రజలను ఎలా హింసించారు….ఆ టైం ప్రజలు ఎలా ఈ వ్యవస్థ మీద ఎదురు ధాడికి దిగారు… ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
రియల్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా కొంచం స్లో నరేషన్ తో ఉంటుంది కానీ ఎంగేజింగ్ గా అనిపించే సీన్స్ చాలా చోట్ల ఉండటం, విజువల్స్ ఎక్స్ లెంట్ గా ఉండటం ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండటంతో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా సినిమా కథ సాగుతుంది…ఇంద్రజ (Indraja), ప్రేమ (Prema) వంటి సీనియర్ హీరోయిన్లు చిన్నపాటి షాక్ ఇచ్చారు. అనసూయ (Anasuya) , మకరంద్ దేశ్ పాండే (Makrand Dehpande) , బాబీ సింహా (Bobby Simha)…
ఇలా అందరూ తమ తమ రోల్స్ లో బాగా నటించి మెప్పించారు…సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా కొన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఎలివేట్ చేసింది… మొత్తం మీద సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా చాలా వరకు సినిమా ఎంగేజింగ్ గానే సాగగా కొన్ని చోట్ల బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది…
కానీ ఓవరాల్ గా రియల్ కథతో తెరకెక్కిన ఈ సినిమా కొంచం ఓపిక చేసుకుని చూస్తె అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అన్నవి చాలా వరకు డైరెక్టర్ బాగా చూపించాడు అని చెప్పొచ్చు…. ఇలాంటి రియల్ స్టోరీ పాయింట్స్ నచ్చే ఆడియన్స్ కొంచం ఓపిక పట్టి చూస్తె కనుక రజాకార్ మూవీ డీసెంట్ గా మెప్పించే అవకాశం ఉంటుంది… సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…