బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 ఇయర్ బాగా స్టార్ట్ అయ్యింది, సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్ లో ఒక సినిమా ఆల్ మోస్ట్ 300 కోట్ల దగ్గరగా గ్రాస్ ను ఒక సినిమా 180 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని మంచి స్టార్ట్ ను సొంతం చేసుకోగా తర్వాత నుండి అన్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి నుండి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నా కూడా….
బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలను అయితే అందుకునే సినిమాలు రాలేదు…దాంతో సమ్మర్ మీద భారీ హోప్స్ పెట్టుకున్నారు…సమ్మర్ లో ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara part1) రిలీజ్ అలాగే తర్వాత మే లో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి 2898AD(Kalki2898AD Movie) రిలీజ్ లు ఉండటంతో…
సమ్మర్ టాలీవుడ్ కి సాలిడ్ గానే ఉంటుంది అనుకుంటూ ఉండగా దేవర మూవీ వర్క్ పెండింగ్ వలన పోస్ట్ పోన్ అవ్వడంతో ఇక ప్రభాస్ కల్కి మూవీ ఒక్కటే సమ్మర్ బిగ్ రిలీజ్ గా అందరూ అనుకుంటూ ఉండగా ఇప్పుడు ఎలక్షన్స్ వలన ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండటంతో…
ఈ సమ్మర్ లో టాప్ స్టార్స్ నటించే సినిమాలు ఏవి కూడా రిలీజ్ లేకుండా పోతుంది…లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్ లో ఒక్క టాప్ స్టార్ నటించిన సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు…దాంతో వరుసగా రెండు ఏళ్ళు టాలీవుడ్ బిగ్ సీజన్స్ లో ఒకటిగా భావించే సమ్మర్ లో టాప్ స్టార్స్ నటించే సినిమాలు లేకుండానే సమ్మర్ సీజన్ సాగబోతుంది….
లాస్ట్ ఇయర్ ఎలాగోలా విరూపాక్ష(Virupaksha) హిట్ గా నిలిచింది. ఇక ఈ ఇయర్ సమ్మర్ లో డిజే టిల్లు2(Tillu Square Movie), ఫ్యామిలీ స్టార్(Family Star) అలాగే కొన్ని ఇతర నోటబుల్ మూవీస్ తప్పితే టాప్ స్టార్స్ మూవీస్ ఏమి లేక పోవడంతో ఈ సమ్మర్ ఎలా సాగుతుందో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఏ సినిమాలు తీసుకు వస్తాయో అన్నది ఇక ఆసక్తిగా మారిందని చెప్పాలి.