Home న్యూస్ 2016 నాటి సినిమా…ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కన్ఫాం…ఎప్పుడంటే!!

2016 నాటి సినిమా…ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కన్ఫాం…ఎప్పుడంటే!!

0

ఎంత మంది క్రేజీ యాక్టర్స్ నటించినా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వలనో లేక టీం లో గొడవల వలనో షూటింగ్ ఆగిపోతూ లేదా రిలీజ్ లు ఆగిపోతూ వస్తాయి. మొదటి కోవ లోకి వచ్చే సినిమాలలో ఒక క్రేజీ సినిమా కూడా ఉంది. ఆ సినిమానే చియాన్ విక్రం హీరోగా…

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం(Dhruva Natchathiram Movie Release Date)సినిమా… ఎప్పుడో 2016 టైంలో షూటింగ్ మొదలైన ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మాణం అవ్వగా అనేక లోకేషన్స్ లో భారీ ఎత్తున షూటింగ్ ను జరుపుకుంది. కానీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వలన షూటింగ్ మధ్యలో ఆగిపోగా…

ఎలాగోలా షూటింగ్ ను పూర్తి చేసుకున్నప్పటికీ కూడా రిలీజ్ ను కన్ఫాం చేసుకోలేక పోయింది. చాలా ఏళ్ళుగా ఈ సినిమా రిలీజ్ ఇప్పుడు ఉంటుంది అప్పుడు ఉంటుంది అంటూ వార్తాలు వచ్చినా అవేవి కూడా నిజం అవ్వలేదు.. అలా ఆల్ మోస్ట్ 8 ఏళ్ళు పూర్తి అవ్వగా…

ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మార్చ్ 28 న రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా టీం అఫీషియల్ గా ఈ డేట్ ను కన్ఫాం చేశారు… లాస్ట్ ఇయర్ కూడా నవంబర్ ఎండ్ లో రిలీజ్ అన్నారు కానీ పోస్ట్ పోన్ అయింది…

సినిమా స్టోరీ పాయింట్ దేశాన్ని కాపాడే భాద్యతలో 10 మంది తమ ఐడెంటిటీని దాచేసుకోగా అలాంటి వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అన్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఈ సారి అనుకున్నట్లు రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here