నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న టైంలో బోయపాటి శ్రీను(Boyapati Sreenu) డైరెక్షన్ లో చేసిన లెజెండ్(Legend Movie) తో 10 ఏళ్ల క్రితం సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు. అంతకన్నా ముందు కూడా వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న టైంలో…
సింహా మూవీతో సాలిడ్ కంబ్యాక్ ను అందుకోగా మళ్ళీ 4 ఏళ్ల గ్యాప్ కి లెజెండ్ తో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ ఇప్పుడు 10 ఏళ్ళు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఈ సినిమాను ఈ నెల ఎండ్ లో రీ రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారట….
బాలయ్య కెరీర్ లో ఆ టైంకి ఎపిక్ కంబ్యాక్ తో పాటు కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు 2024 మార్చ్ 30న సినిమాను గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం… తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 300 వరకు స్క్రీన్స్ లో అలాగే….
వరల్డ్ వైడ్ గా 400 వరకు స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అల్టిమేట్ మాస్ మూమెంట్స్ అండ్ దేవి శ్రీ ప్రసాద్ ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో దుమ్ము లేపిన లెజెండ్ ఎలివేషన్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండటంతో రీ రిలీజ్ లో మంచి రెస్పాన్స్ ను మరోసారి సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు… ఇక ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.