Home న్యూస్ 24 గంటలు ఓవర్…కంగువ టీసర్ కి సాలిడ్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్…కంగువ టీసర్ కి సాలిడ్ రెస్పాన్స్!!

0

కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) కి ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ అవసరం, ఎప్పటి నుండో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సూర్య …ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువ(Kanguva Movie) తో సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ అండ్ గ్లిమ్స్, టీసర్ లు అన్నీ కూడా అంచనాలు సాలిడ్ గా పెరిగేలా చేశాయి అని చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ చేసిన కొత్త టీసర్ మరోసారి అంచనాలను అన్నీ కూడా మించి పోయి విజువల్స్ పరంగా సూర్య కొత్త ఓవర్ తో సాలిడ్ గ్రాండియర్ గా అనిపించింది….

దాంతో సినిమా మీద ఉన్న అంచనాలను అన్నీ మించిపోయేలా చేసిన ఈ టీసర్ యూట్యూబ్ లో 24 గంటల్లో ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…. ఓవరాల్ గా వ్యూస్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ సినిమా టీసర్ కి 14.72 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి…

ఇక లైక్స్ పరంగా చూసుకుంటే 24 గంటల్లో 428.3K లైక్స్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో కూడా సినిమా మీద మంచి బజ్ ఉండగా సినిమా కూడా ఓవరాల్ గా అంచనాలను అందుకుంటే సూర్యకి అటు తమిళ్ లో ఇటు తెలుగు లో ఎక్స్ లెంట్ కంబ్యాక్ ఫిల్మ్ గా కంగువ నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here