Home న్యూస్ సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలి!

సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలి!

0

కోవిడ్ టైంలో OTT లో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో మంచి సక్సెస్ ను సొంతం చేసుకున్న సత్యదేవ్(Satyadev) తర్వాత వరుస పెట్టి సినిమా ఆఫర్స్ ను సొంతం చేసుకున్నాడు, కానీ అనుకున్న రేంజ్ లో అయితే సక్సెస్ సొంతం అవ్వలేదు, కొన్ని పర్వాలేదు అనిపించే సినిమాలు వచ్చినా కూడా…

ఓ మంచి బాక్స్ ఆఫీస్ సక్సెస్ కోసం సత్యదేవ్ ఇంకా ఎదురు చూస్తున్నాడు అని చెప్పాలి. కాగా ఇలాంటి టైంలో కొరటాల శివ(Koratala Shiva) లాంటి టాప్ డైరెక్టర్ నిర్మాతగా మారి చేస్తున్న కృష్ణమ్మ(Krishnamma Movie) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా ట్రైలర్ లోనే సినిమా కథ ఎలా ఉండబోతుంది అన్నది క్లియర్ గా చెప్పగా రివేంజ్ యాక్షన్ మూవీగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ లోనే తెలిసి పోయింది. ఇక సినిమా బిజినెస్ పరంగా చాలా వరకు ఓన్ గానే రిలీజ్ కానుంది. ప్రజెంట్ ఉన్న పొలిటికల్ హీట్, సమ్మర్ టైం అలాగే IPL ఎండ్ స్టేజ్ కి రావడం లాంటి అడ్డంకులు ఉండగా…

కొన్ని చోట్ల అడ్వాన్స్ లతో కొన్ని చోట్ల ఓన్ గా రిలీజ్ కానున్న కృష్ణమ్మ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కి వాల్యూ టార్గెట్ కావాలి అంటే ఓవరాల్ రిలీజ్ అండ్ సత్యదేవ్ ప్రీవియస్ మూవీస్ రేంజ్ ను బట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని కనుక సొంతం చేసుకుంటే డీసెంట్ హిట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు….

ప్రజెంట్ సమ్మర్ టైంలో ఆడియన్స్ ను థియేటర్స్ పెద్దగా రప్పించే సినిమాలు పెద్దగా రావడం లేదు కనుక ఈ సినిమాకి టాక్ పాజిటివ్ గా వస్తే మాస్ ఆడియన్స్ అండతో అంచనాలను అందుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ సినిమా సత్యదేవ్ ఓ మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here