బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో సినిమాలు పెద్దగా అంచనాలను అయితే అందుకోలేక పోతున్నాయి…వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా పెద్దగా థియేటర్స్ కి ఆడియన్స్ ను రప్పించడం లేదు. లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ పెద్దగా జోరు ని చూపించలేదు. ఇక ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు….
నారా రోహిత్(Nara Rohit) నటించిన ప్రతినిధి2(Prathinidhi 2 Movie) సినిమా ఒకటి కాగా మరోటి సత్యదేవ్(Satyadev) నటించిన కృష్ణమ్మ(Krishnamma Movie) సినిమాలు డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా రెండు సినిమాల బుకింగ్స్ కూడా ఏమాత్రం జోరుని అయితే చూపించ లేక పోయాయి అని చెప్పాలి.
అడ్వాన్స్ బుకింగ్స్ రెండు సినిమాలకు కూడా బిలో యావరేజ్ లెవల్ లోనే ఉండగా ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ జస్ట్ ఓకే అనిపించేలా ఉన్నాయి…మొత్తం మీద రెండు సినిమాలు ప్రజెంట్ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 35-40 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
మాస్ సెంటర్స్ లో కృష్ణమ్మ మూవీ కొంచం బెటర్ గా హోల్డ్ ని చూపిస్తూ ఉండటంతో కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది. కానీ సమ్మర్ లో వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపాల్సిన టాలీవుడ్ వరుస పెట్టి బిలో పార్ కలెక్షన్స్ నే అందుకుంటూ ఈ సమ్మర్ ని వన్ ఆఫ్ ది వీకేస్ట్ సమ్మర్స్ లో ఒకటిగా చేస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.