Home న్యూస్ 150 కోట్ల బ్లాక్ బస్టర్ ఆవేశం తెలుగు రివ్యూ…మంచి రీమేక్ మెటీరియల్!

150 కోట్ల బ్లాక్ బస్టర్ ఆవేశం తెలుగు రివ్యూ…మంచి రీమేక్ మెటీరియల్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో రీసెంట్ టైంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ రాగా రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం(Aavesham Movie) సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…

కాగా సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇతర భాషల ఆడియన్స్ కూడా ఎగబడి చూస్తున్నారు….కేవలం మలయాళంలోనే రిలీజ్ అయిన ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ లు ఏవి రిలీజ్ కాలేదు…బహుశా రీమేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు…

ఇక ఈ సినిమా కథ పాయింట్ కి వస్తే బెంగళూరులో కాలేజ్ లో ఎంటర్ అయిన 3 ఫ్రెషర్స్ ని సీనియర్ ఒకరు తన గ్యాంగ్ తో ర్యాగింగ్ చేసి చిత్రహింసలు పెడతాడు ఒక రాత్రి మొత్తం, దాంతో తన మీద రివేంజ్ తీసుకోవడానికి ఒక దాదా కోసం చూస్తున్న టైంలో హీరో అయిన ఫహాద్ ఫాజిల్ తో ఆ 3 స్టూడెంట్స్ కి పరిచయం ఏర్పడుతుంది….

ఆ 3 స్టూడెంట్స్ ని చూసి తన కాలేజ్ డేస్ కి తిరిగి గుర్తు చేసుకునే హీరో వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అవుతాడు, కానీ అదే టైంలో రౌడీతో తిరుగుతూ తమ చదువులను పూర్తిగా పక్కకు పెట్టేసి చెడు వ్యసనాలను పెంచుకున్న 3 ఫ్రెండ్స్ తమ రివేంజ్ ను ఫహాద్ ఫాజిల్ సహాయంతో తీర్చుకున్నా తనతో ఇక తిరగాకూడదు అనుకున్నా ఫహాద్ ఫాజిల్ వాళ్ళని వదలడు…

ఇక ఆ తర్వాత ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….కాలేజ్ బ్యాగ్ డ్రాప్ తోనే తెరకేక్కినా కూడా కథ మొత్తం ఫహాద్ ఫాజిల్ చుట్టే తిరగగా రంగా అన్నగా తన నటన స్క్రీన్ ప్రజెన్స్ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది…. 

ఫస్టాఫ్ చాలా ఫాస్ట్ గానే సాగినా సెకెండ్ ఆఫ్ మాత్రం సీన్స్ కొన్ని రిపీటివ్ గా అనిపిస్తాయి కానీ చాలా వరకు ఎంగేజింగ్ సీన్స్ తో నిండిపోయిన సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది…. సబ్ టైటిల్స్ తో చూడటం అలవాటు ఉన్న వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో సినిమాను చూడొచ్చు…

ఇక సినిమా ఓ మంచి రీమేక్ మెటీరియల్ అని చెప్పొచ్చు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఎవరైనా చేస్తే తెలుగులో కూడా కొన్ని మార్పులతో మంచి హిట్ గా నిలిచే అవకాశం ఈ సినిమాకి ఎంతైనా ఉంది… ఈ లోపు తెలుగు లో ఎవరైనా డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచన చేస్తే థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయోచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here