Home టోటల్ కలెక్షన్స్ ప్రతినిధి2: 3.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!

ప్రతినిధి2: 3.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!

0

చాలా టైంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూసిన హీరోలలో నారా రోహిత్(Nara Rohit) కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి2(Prathinidhi 2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ మధ్య వచ్చిన పొలిటికల్ మూవీస్ ఏవి కూడా పెద్దగా అంచనాలను అందుకోలేక పోయాయి…

కాగా ఎలక్షన్స్ మూమెంట్ లో రిలీజ్ అయిన ప్రతినిధి2 మాత్రం ఎంతో కొంత ఆడియన్స్ ను అలరించి నారా రోహిత్ కి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వారంలోనే చేతులు ఎత్తేయగా తర్వాత కంప్లీట్ గా ఫేడ్ ఔట్ అయిపొయింది.

మొత్తం మీద టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 87 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా మరో 13 లక్షలు కలెక్ట్ చేసి టోటల్ గా 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ప్రతినిధి2 మూవీ…

టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ 2.25 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 3.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా టోటల్ రన్ లో వాల్యూ టార్గెట్ లో 2.5 కోట్ల దాకా లాస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది…దాంతో నారా రోహిత్ హిట్ కోసం వేట కొనసాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here