బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు నారా రోహిత్(Nara Rohit) నటించిన ప్రతినిధి2(Prathinidhi 2 Movie) మరియు సత్యదేవ్(Satyadev) నటించిన కృష్ణమ్మ(Krishnamma Movie) పెద్దగా జనాలను థియేటర్స్ కి రప్పించ లేక పోయాయి. వీకెండ్ లో ఎంతో కొంత కృష్ణమ్మ మూవీ పర్వాలేదు అనిపించగా…
ప్రతినిధి2 సినిమా మాత్రం ఏమాత్రం హోల్డ్ ని చూపించలేదు. ఇక రెండు సినిమాలు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా 4వ రోజు కొంచం కృష్ణమ్మ మూవీ పర్వాలేదు అనిపించుకుంది. ఇక 5వ రోజు విషయానికి వస్తే ప్రతినిధి2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 9 లక్షల షేర్ ని అందుకోగా…
టోటల్ గా 5 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 73 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 83 లక్షల షేర్ ని 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమా వాల్యూ టార్గెట్ 3.5 కోట్లు కాగా సినిమా ఇంకా 2.67 కోట్ల షేర్ దూరంలో ఉండిపోయింది. ఇక కృష్ణమ్మ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…
5వ రోజన తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ 20 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. దాంతో టోటల్ గా సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 1.43 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.68 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.
సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 3 కోట్ల దాకా ఉండగా సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం 1.32 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సింగిల్ స్క్రీన్స్ కొన్ని రోజుల పాటు మూసేస్తున్నారు కాబట్టి రెండు సినిమాలకు కలెక్షన్స్ పరంగా మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.