బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా యానిమల్(Animal Movie)…ఊహకందని కలెక్షన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 910 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత కూడా సినిమా రాంపెజ్ కొనసాగింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేసిన తర్వాత ఈ సినిమా డిజిటల్ లో దుమ్ము లేపడం మొదలు పెట్టగా…అక్కడ సాలిడ్ రికార్డులను నమోదు చేస్తూ హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆల్ మోస్ట్ రిలీజ్ అయిన 2 వారాల్లో 13.6 మిలియన్ 1 మినట్ వాట్చ్ టైం ను సొంతం చేసుకుని నెట్ ఫ్లిక్స్ లో…
వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను అందుకున్న సినిమాగా కూడా నిలిచింది. ఇలాంటి మమ్మోత్ మూవీని ఓ చిన్న సినిమా ఓడించింది…బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సినిమా అన్న పేరు వచ్చినా కూడా అనుకున్న రేంజ్ సక్సెస్ ను అందుకోలేక పోయిన చిన్న సినిమా లాపతా లేడీస్(Laapataa Ladies Movie) రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది.
నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమాకి అక్కడ సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా భారీ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న ఈ సినిమా 2 వారాల టైంకే 13.8 మిలియన్ 1 మినట్ వాట్చ్ టైం ను సొంతం చేసుకుని ఏకంగా యానిమల్ మూవీ డిజిటల్ రికార్డ్ వ్యూవర్ షిప్ ను బ్రేక్ చేసింది…
ఈ సినిమా బడ్జెట్ పరంగా 7 కోట్ల లోపే బడ్జెట్ తో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి డిజిటల్ లో కూడా ఊహకందని రికార్డులను నమోదు చేసిన యానిమల్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేయడం అంటే మాములు విషయం కాదు, చిన్న సినిమానే అయినా యునానిమస్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ సినిమా డిజిటల్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.