Home న్యూస్ రాజు యాదవ్ అలా…..లవ్ మీ ఏమో ఇలా….ఏంటి సామి ఇదీ!

రాజు యాదవ్ అలా…..లవ్ మీ ఏమో ఇలా….ఏంటి సామి ఇదీ!

0

జనాలను థియేటర్స్ కి రప్పించ డానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు…కానీ కొన్ని సార్లు అది రియాలిటీకి దూరంగా ఉంటాయి. పెద్ద స్టార్స్ మూవీస్ విషయంలో ఎలాగైనా థియేటర్స్ కి జనాలను రప్పించ డానికి వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని పోస్టర్స్ లో వదలడం లాంటివి మనం చాలా సార్లే చూశాం…

కానీ ఈ మధ్య ఇవి చిన్న సినిమాలకు కూడా పాకాయి… అసలే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న సినిమాల పరిస్థితి ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు…ఇలాంటి టైంలో లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన గెటప్ శీను(Getup Seenu) నటించిన రాజు యాదవ్(Raju Yadav) మరియు ఆశిష్ హీరోగా నటించిన లవ్ మీ(Love Me Movie) లు రిలీజ్ అవ్వగా…

రెండు సినిమాలు కూడా ఆడియన్స్ నుండి ఆశించిన మేర రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదు. ఉన్నంతలో ట్రైలర్ క్లిక్ అవ్వడంతో లవ్ మీ వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా రాజు యాదవ్ పెద్దగా జోరుని చూపించ లేక పోయింది. కానీ రెండు సినిమాల కొత్త పోస్టర్ లు అందరినీ ఆశ్యర్యపరిచాయి అని చెప్పాలి…

లవ్ మీ 3 రోజుల్లో ఓవరాల్ గా 9.03 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేసిందని పోస్టర్ ను వదిలారు…ఇక రాజు యాదవ్ మూవీ 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని కూడా కంప్లీట్ చేసుకుందని పోస్టర్ ను రిలీజ్ చేశారు…కానీ ట్రేడ్ లెక్కల్లో రియాలిటీకి చాలా దూరంలో ఈ రెండు సినిమాలు ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే…

కానీ చిన్న సినిమాలు అయిన వీటికే ఇలా చేస్తే పెద్ద సినిమాల విషయంలో ఎలాంటి జిమ్మిక్కులు మేకర్స్ వాడతారో అర్ధం చేసుకోవచ్చు. ఆల్ మోస్ట్ బుక్ మై షోలో ఏ సినిమాకి ఎన్ని టికెట్స్ తెగాయో క్లియర్ గా తెలుస్తూనే ఉన్నా ఇలా పోస్టర్స్ తో వచ్చింది ఒకటి అయితే పోస్టర్స్ లో ఒక లెక్కలను చూపెడుతున్నారు మేకర్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here