Home న్యూస్ ప్రభాస్ కల్కి AP-TG టికెట్ హైక్స్ రేట్లు ఎంతో తెలుసా!!

ప్రభాస్ కల్కి AP-TG టికెట్ హైక్స్ రేట్లు ఎంతో తెలుసా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను పెంచేసింది…

299 అంటే గొడవ చేశారు…ఇప్పుడు రేటు తగ్గించారు…ఏమవుతుందో ఇక!!
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో పెద్ద స్టార్స్ నటించే సినిమాలకు మంచి టికెట్ హైక్స్ కన్ఫాం అవ్వడం ఖాయం అవ్వగా ముందుగా రిలీజ్ అవ్వబోతున్న కల్కి మూవీకి ఇప్పుడు భారీ రిలీజ్, బెనిఫిట్ షోలు అలాగే భారీ టికెట్ హైక్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోబోతుంది. నైజాంలో ఆల్ రెడీ టికెట్ హైక్స్ అన్ని సినిమాలకు అందుబాటులో ఉండగా…

కల్కి సినిమా కి నైజాంలో మల్టిప్లెక్స్ థియేటర్స్ లో 413 వరకు టికెట్ రేటు ఉండబోతుంది. ఇక సింగిల్ స్క్రీన్స్ లో సినిమా టికెట్ రేటు 236 వరకు ఉండబోతుందని సమాచారం. రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ కి చాలా వరకు ఇవే రేంజ్ లో రేట్లు సొంతం అవ్వడంతో కల్కి కి కూడా ఇదే రేంజ్ లో రేటు సొంతం అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయం.

వద్దని ఆపేసిన సినిమా….టికెట్ 140…..టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా!!
ఇక ఆంధ్రలో ఇది వరకు టికెట్ హైక్స్ చాలా కష్టం అవ్వగా ఇప్పుడు అన్నీ సెట్ అయినట్లు కనిపిస్తూ ఉండగా కల్కి మూవీకి ఆంధ్రలో సింగిల్ స్క్రీన్స్ లో 207 వరకు టికెట్ రేటు ఉండబోతుండగా మల్టిప్లెక్స్ థియేటర్స్ లో సినిమా కి 354 వరకు టికెట్ రేటు ఉండబోతుంది. ఇది వరకు మాగ్జిమం లెక్క 250 వరకు ఉండేది…

కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీ అయిన కల్కికి మంచి రేటు ఇక్కడ కూడా సొంతం అవ్వడంతో ఆంధ్రలో కూడా ఇప్పుడు మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక ఈ టికెట్ హైక్స్ ఎన్ని రోజులు ఉండబోతుంది ఎప్పుడు తగ్గుతుంది లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ టికెట్ హైక్స్ అడ్వాంటేజ్ తో సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here