Home న్యూస్ వారం మొత్తం 4కి తగ్గలే….చితక్కొట్టిన చిన్న సినిమా!!

వారం మొత్తం 4కి తగ్గలే….చితక్కొట్టిన చిన్న సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా (Munjya Movie) సినిమా మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ గా జోరుని చూపించింది. వీకెండ్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా ఏమాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకోకుండా…

ప్రతీ రోజూ సాలిడ్ హోల్డ్ ని చూపెడుతూ ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. సినిమా మొదటి వారంలో ప్రతీ రోజూ 4 కోట్లకు తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని అన్ని రోజులు సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. 4వ రోజు నుండి సినిమా మొదటి రోజు లెవల్ లో హోల్డ్ ని చూపెడుతూ ఉండగా….

7వ రోజు వరకు కూడా 4 కోట్లకు తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 6వ రోజు 4.11 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా 7వ రోజున సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. దాంతో ఓవరాల్ గా మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి ఓవరాల్ గా…

36.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకోగా రెండో వీకెండ్ లో మూవీ మళ్ళీ రాంపెజ్ ను చూపించే అవకాశం ఉండగా రెండో వీకెండ్ కలెక్షన్స్ తో 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా…

లాంగ్ రన్ లో అవలీలగా 75 కోట్ల క్లబ్ లో సినిమా చేరే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. రీసెంట్ టైంలో బాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లో చాలా లిమిటెడ్ డ్రాప్స్ తో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here