Home న్యూస్ కల్కిని తట్టుకుని సెంచరీ కొట్టేసిన చిన్న సినిమా….రికార్డ్ ఇది!!

కల్కిని తట్టుకుని సెంచరీ కొట్టేసిన చిన్న సినిమా….రికార్డ్ ఇది!!

0

బాక్స్ అఫీస్ దగ్గర పాన్ ఇండియా వైడ్ గా ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) మ్యానియా కొనసాగుతూ ఉండగా అన్ని చోట్లా కూడా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ గా వసూళ్లు వస్తూ ఉండగా ఇప్పుడు…

హిందీలో కూడా సినిమా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ తెలుగుకి మించిపోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…ఇక కల్కి వచ్చే వరకు కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక చిన్న సినిమా హవా నడిచింది…

అసలు స్టార్ కాస్ట్ కూడా పెద్దగా లేని…మెయిన్ లీడ్ ఒక CGI గ్రాఫిక్స్ లో చేసిన క్యారెక్టర్ తో వచ్చిన ముంజ్య(Munjya Movie) అనే సినిమా ట్రైలర్ తోనే ఆకట్టుకుని తర్వాత సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది….

   

కాగా కల్కి రిలీజ్ టైంకి 90 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా కల్కి రిలీజ్ తో స్లో అయింది అనుకున్నారు అందరూ…థియేటర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయిన ఈ సినిమా ఇక 100 కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో అని డౌట్స్ పడ్డా కూడా లిమిటెడ్ థియేటర్స్ లోనే…

బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 25 రోజులను పూర్తి చేసుకుని ప్రతిష్టాత్మక 100 కోట్ల క్లబ్ లో చేరింది. చాలానే సినిమాలు బాలీవుడ్ లో ఇలా 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి కానీ ఇలా ఒక CGI గ్రాఫిక్స్ లో చేసిన…

ఒక క్యారెక్టర్ మెయిన్ లీడ్ లో నటించిన సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకోవడం బాలీవుడ్ లో ఇదే తొలిసారి. ఆ విధంగా సినిమా హిందీలో ఇప్పుడు రికార్డ్ ను క్రియేట్ చేసింది. కల్కిని తట్టుకుని కూడా ఇలా 100 కోట్లని పూర్తి చేసుకోవడం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here