Home న్యూస్ 3 ఆప్షన్స్ ఉన్నాయి….బాలయ్య ఏది ఎంచుకుంటాడో మరి!

3 ఆప్షన్స్ ఉన్నాయి….బాలయ్య ఏది ఎంచుకుంటాడో మరి!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. బాక్ టు బాక్ మూడు వరుస విజయాలు, మూడు వరుస 70 కోట్ల షేర్ మార్క్ మూవీస్ తో సీనియర్స్ లో క్రేజీ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఇంకా పేరు పెట్టని NBK109 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు….

ఇప్పటికే సినిమా నుండి వచ్చిన 2 గ్లిమ్స్ లు కూడా సినిమా మీద అంచనాలను అయితే భారీగా పెంచేశాయి. బాలయ్య ఖాతాలో మరో సాలిడ్ హిట్ గా ఈ సినిమా నిలవడం ఖాయం అనిపించే నమ్మకం కలిగించిన ఈ సినిమా కోసం ఇప్పుడు బాలయ్య అండ్ టీం మంచి రిలీజ్ డేట్ కోసం వెతుకున్నట్లు తెలుస్తుంది. ఆల్ మోస్ట్ సినిమా షూటింగ్ 60% కి పైగానే జరిగిందట…

బాలెన్స్ షూటింగ్ ఇప్పుడు 3వ సారి ఎన్నికల్లో గెలవడంతో త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య కూడా పాల్గొనబోతూ ఉండటంతో కొంచం డిలే అయ్యే అవకాశం ఉండటంతో సినిమా రిలీజ్ పై కొన్ని డౌట్స్ నెలకొన్నాయి. కాగా ఇప్పటికీ టీం దసరాని అయితే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ అది జరగాలి అంటే సినిమా షూటింగ్…

ఇలాంటి దారుణమైన ప్రమోషన్స్ ఏ సినిమాకి జరగలేదేమో!!
డే అండ్ నైట్ జరిగితేనే ఆ టైంకి వచ్చే అవకాశం ఉంటుంది…ఇక అప్పుడు మిస్ అయితే డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆప్షన్ ను కూడా టీం పరిశీలిస్తూ ఉండగా లాంగ్ రన్ కి సంక్రాంతి మూవీస్ ఇంపాక్ట్ చూపే అవకాశం కూడా ఉండటంతో మరోసారి సంక్రాంతికే బాలయ్య మూవీ వస్తే ఎలా ఉంటుంది అన్న…

ఆలోచన కూడా చేస్తున్నారట. దాంతో మొత్తం మీద NBK109 సినిమా కి 3 రిలీజ్ ఆప్షన్ లు ఉండగా బాలయ్య అండ్ టీం ఏ డేట్ కి ఓకే చెబితే ఆ టైంలో సినిమా రిలీజ్ ఉండే అవకాశం ఉంటుదని అంటున్నారు. సంక్రాంతికి ఆల్ రెడీ చాలా సినిమాలనే అనౌన్స్ చేయడంతో ఆ డేట్ ఈ సారి కొంచం కష్టమే అంటున్నారు…మరి డిసెంబర్ ఎండ్ టైంకే సినిమా బరిలోకి దిగుతుందో లేక డేట్ చేంజ్ అవుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here