Home న్యూస్ ఇలాంటి దారుణమైన ప్రమోషన్స్ ఏ సినిమాకి జరగలేదేమో!!

ఇలాంటి దారుణమైన ప్రమోషన్స్ ఏ సినిమాకి జరగలేదేమో!!

0

టాలీవుడ్ లో కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ సినిమాల అప్ డేట్స్ విషయంలో చాలా డిలే చేస్తూ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ చేత ట్రోల్ కి గురి అవుతూ ఉంటారు. ఒక టైం కి అప్ డేట్ అని అనౌన్స్ చేసి తీరా ఆ టైం వచ్చాక కావాలని కొన్ని సార్లు అనుకోని కారణాల వలన కొన్ని సార్లు అప్ డేట్స్ ని డిలే చేస్తూ ఉంటారు.

దాంతో ఫ్యాన్స్ కే కాదు ఇతర ఆడియన్స్ కి కూడా చిరాకు రావడం ఖాయం. లేటెస్ట్ గా ఇలాంటిదే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఓన్ ప్రొడక్షన్ హౌస్ అయిన కొణిదెల ప్రొడక్షన్ హౌస్ అండ్ ప్రొడ్యూసర్ NV ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న గాడ్ ఫాధర్ విషయంలో జరిగింది.

దసరా కి సినిమాను అనౌన్స్ చేశారు, ఒక టీసర్ మినహా సినిమా సాంగ్ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు అంటూ సోషల్ మీడియాలో సినిమా పోస్ట్ పోన్ అంటూ కామెంట్స్ వచ్చిన వెంటనే సినిమా దసరాకే వస్తుందని అనౌన్స్ చేసిన టీం ఫస్ట్ సాంగ్ ని వెంటనే రిలీజ్ చేస్తున్నాం అంటూ అనౌన్స్ చేశారు.

ఇక కౌండ్ డౌన్ ట్వీట్స్ అండ్ సాంగ్ గ్లిమ్స్ తో అనుకున్న టైం కి సాంగ్ ప్రోమోని రిలీజ్ చేస్తారు అనుకుంటే ప్రోమో కొంత సేపు డిలే చేయగా తర్వాత రోజు సాంగ్ అయినా టైం కి రిలీజ్ చేస్తారు అనుకుంటే మళ్ళీ కౌండ్ డౌన్ పోస్టర్స్ లో వీడియో గ్లిమ్స్ లు రిలీజ్ చేసి తీరా సాంగ్ రిలీజ్ టైం కి లిరికల్ వీడియోని రిలీజ్ చేయలేదు..

దాంతో అందరికీ చిర్రెత్తుకొచ్చి ట్రోల్ చేస్తూ ఉంటే సాంగ్ స్పాటిఫై లింక్ ని రిలీజ్ చేశారు, ఇంత సేపు ఎదురు చూసింది దీనికా అని మళ్ళీ ట్రోల్స్ పడగా కొద్ది సేపటికి టెక్నికల్ గ్లిట్చ్ వలన సాంగ్ అప్ డేట్ లేట్ అవుతుంది కొద్ది సేపట్లో అప్ డేట్ ఇస్తామని చెప్పగా 2 రోజులు కావోస్తున్నా ఆ డేట్ ఇప్పటికీ ఇవ్వలేదు…. దాంతో ఇలాంటి దారుణమైన ప్రమోషన్స్ రీసెంట్ టైం లో ఏ సినిమాకి జరగలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అందరూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here