Home న్యూస్ నైజాంలో ఇండస్ట్రీ రికార్డ్ ఖాయం!… డైనోసార్ దెబ్బకి చుక్కలు కనిపిస్తున్నాయి!!

నైజాంలో ఇండస్ట్రీ రికార్డ్ ఖాయం!… డైనోసార్ దెబ్బకి చుక్కలు కనిపిస్తున్నాయి!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ లో ఒకరు….రీసెంట్ టైంలో స్టార్స్ నటించిన సినిమాలు తక్కువగానే రిలీజ్ అవుతూ ఉండగా వరుస పెట్టి సినిమాలతో రచ్చ చేస్తున్న ప్రభాస్ మాత్రం సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్నాడు…

ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) భారీ లెవల్ లో రిలీజ్ అవుతూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా నైజాం గడ్డ మీద మాత్రం మరో లెవల్ లో దూసుకు పోతున్న కల్కి మూవీ సంచలన బుకింగ్స్ తో రికార్డులు నమోదు చేస్తుంది…

అక్షరాలా 1012 కోట్లు…ఏడాదిలో రెబల్ స్టార్ రికార్డ్!
ప్రీవియస్ గా నైజాం ఏరియాలో రికార్డులు క్రియేట్ చేసి సంచలన ఓపెనింగ్స్ ను అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ సలార్ సినిమాల ప్రీ బుకింగ్స్ రికార్డులను బ్రేక్ చేసింది….ఆల్ మోస్ట్ 20 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను ఇప్పటికే సొంతం చేసుకున్న కల్కి మూవీ ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే…

నైజాంలో ఆల్ టైం బిగ్గెస్ట్ డే 1 రికార్డ్ ను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….నైజాంలో ఇది వరకు సలార్ మూవీ 22.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 23.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నాయి….గ్రాస్ పరంగా కూడా….

యానిమల్ 1st డే టోటల్ కలెక్షన్స్….ఊచకోత సామి ఇదీ!
సలార్ మూవీ 32 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 33.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇప్పటికే కల్కి మూవీ 20 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా బుకింగ్స్ జోరు చూస్తూ ఉంటే ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా తొలిరోజు లెక్క….

35 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు…టాక్ యునానిమస్ గా కానీ వస్తే గ్రాస్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద నైజాం ఏరియాలో మొదటి రోజు కల్కి మూవీ కి ఇండస్ట్రీ రికార్డ్ సొంతం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇదే నిజం అవుతుందో కాదో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here