బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమాలు అప్పుడప్పుడు టెలివిజన్ లో సూపర్ డూపర్ సక్సెస్ గా నిలుస్తాయి…కానీ ఈ మధ్య పెద్ద సినిమాలకు కూడా టెలివిజన్ లో కూడా అనుకున్న రేంజ్ లో రేటింగ్ లు సొంతం అవ్వడం లేదు…. కానీ అప్పుడు కొన్ని సినిమాలకు ఊహించని రేటింగ్ లు సొంతం అవుతూ ఉండగా…
లేటెస్ట్ గా అలాంటి ఫీట్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi TRP Rating) టెలివిజన్ లో దుమ్ము లేపే రేటింగ్ తో మాస్ రచ్చ చేసింది. మొదటి పార్ట్ భారీ సక్సెస్ వలన ఈ సీక్వెల్ మీద కొంచం హైప్ వచ్చినా కూడా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ గట్టిగానే కనిపించగా టోటల్ రన్ లో 1.85 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే అందుకుని భారీ డిసాస్టర్ గా నిలిచింది…కాగా సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను డీసెంట్ రేటు చెల్లించి స్టార్ మా ఛానెల్ వాళ్ళు సొంతం చేసుకోగా…
సినిమాను రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు…కాగా సైలెంట్ గా రిలీజ్ అయినా కూడా సినిమాకి ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఏకంగా 7.39 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది ఈ సినిమా…ఓవరాల్ గా సినిమాకు పెట్టిన రేటుకి ఛానెల్ కి సూపర్ రేటింగ్ సొంతం అయ్యింది అని చెప్పాలి.
బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా ఈ రేంజ్ లో రేటింగ్ సొంతం అవ్వడం అంటే విశేషమే అని చెప్పాలి. అప్పట్లో మొదటి పార్ట్ కి కూడా జీ తెలుగు లో 15కి పైగా రేటింగ్ సొంతం అయ్యింది…ఆ సినిమా తో పోల్చితే సగం రేటింగ్ వచ్చినా ఈ సినిమా రిజల్ట్ దృశ్యా టెలివిజన్ లో మంచి రేటింగ్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి.