సౌత్ ఇండస్ట్రీ లో బాహుబలి తర్వాత వచ్చిన సినిమాల్లో రీసెంట్ గా రెండు సినిమాలు ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ రెండు సినిమాలే మెర్సల్ మరియు రంగస్థలం సినిమాలు. ముందుగా మెర్సల్ సినిమా కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ టోటల్ రన్ లో 121 కోట్ల షేర్ ని 232 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక తెలుగు వర్షన్ సుమారు 6.2 కోట్ల షేర్ ని 12 కోట్ల గ్రాస్ ని సినిమా సాధించింది.
దాంతో టోటల్ గా సినిమా 127.2 కోట్ల షేర్ ని 244 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. కానీ సౌత్ మూవీస్ అన్నీ చూసుకుంటే ఇప్పుడు రంగస్థలం ఒక్క తెలుగు వర్షన్ కలెక్షన్స్ తో మెర్సల్ షేర్ ని బ్రేక్ చేసి 127.52 కోట్ల షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది.
కానీ గ్రాస్ మాత్రం 215 కోట్లు మాత్రమె ఉండటం మెర్సల్ టోటల్ గ్రాస్ ని అందుకోలేక పోయింది. గ్రాస్ లో ఇంత తేడా రావడానికి కారణం, మెర్సల్ వరల్డ్ వైడ్ గా భారీ గా రిలీజ్ అవ్వడం ఒక్కో కంట్రీ లో ఒక్క రకమైన టాక్స్ ఉండటం వలన గ్రాస్ ఎక్కువగా షేర్ తక్కువగా వచ్చింది. ఓవరాల్ గా షేర్ ముఖ్యం కాబట్టి మెర్సల్ కలెక్షన్స్ ని బీట్ చేసి రంగస్థలం చుక్కలు చూయించింది అని చెప్పొచ్చు.