Home న్యూస్ AP-TG టాప్ 1st డే కలెక్షన్స్…..దేవర ఏ ప్లేస్ కొడుతుందో ఇక!!

AP-TG టాప్ 1st డే కలెక్షన్స్…..దేవర ఏ ప్లేస్ కొడుతుందో ఇక!!

0

భారీ అంచనాల నడుమ ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు అయితే సాలిడ్ గా ఉండగా, ఏ రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ లేపుతుందో అని అందరూ…

ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు. ప్రజెంట్ సినిమా మీద ఉన్న క్రేజ్ కి తెలుగు రాష్ట్రాల్లో అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, అలాగే ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా చూసుకుంటే ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను…

దక్కించు కోవడం కూడా ఖాయమే అని చెప్పాలి. ప్రస్తుతానికి టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్స్ పరంగా RRR Movie ఎవ్వరికీ అందనంత ఎత్తులో టాప్ లో ఉండగా RRR మరియు సలార్ లు మాత్రమే మొదటి 50 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ను అందుకున్నాయి…

ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 
AP TG 1st Day Highest Share Movies
1. RRR Movie – 74.11CR
2. SALAAR- 50.49CR
3. Kalki 2898 AD – 44.86CR*****
4. Baahubali2- 43CR
5. Guntur Kaaram – 38.88CR
6. Sye Raa Narasimha Reddy- 38.75Cr
7. Saaho – 36.52Cr
8. Sarkaru Vaari Paata – 36.01CR
9. Adi Purush – 32.84Cr
10. Sarileru Neekevvaru – 32.77Cr
11. VakeelSaab – 32.24Cr
12. Acharya – 29.50Cr

13. Aravindha Sametha- 26.64C
14. Bheemla Nayak – 26.42CR

15. Agnyaathavaasi-26.40C

ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన లాస్ట్ మూవీ అరవింద సమేత అప్పట్లో ఓవరాల్ గా డే 1 రికార్డ్ ను నమోదు చేసింది నాన్ బాహుబలి మూవీస్ లో, అప్పటి మార్కెట్ తో పోల్చితే ఇప్పటి మార్కెట్ సాలిడ్ గా పెరిగింది… ఆ రేంజ్ ఎలా ఉంటుంది అన్నది ఆర్ ఆర్ ఆర్ మూవీతో రుజువు కూడా అయ్యింది…

ఎలాగూ సీడెడ్ లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తూ ఉండగా కోస్టల్ ఆంధ్ర లో కూడా సినిమా కుమ్మేసే అవకాశం ఉంది, నైజాంలో కూడా బజ్ సాలిడ్ గానే ఉండటంతో ఓవరాల్ గా టాప్ 5 ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. టాక్ ను బట్టి అది ఏ ప్లేస్ కి వెళుతుంది అన్నది చెప్పగలం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here