Home న్యూస్ 5 నిమిషాల ట్రైలర్….బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ సింగం అగైన్ ట్రైలర్ రివ్యూ!!

5 నిమిషాల ట్రైలర్….బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ సింగం అగైన్ ట్రైలర్ రివ్యూ!!

0

ఈ ఇయర్ బాలీవుడ్ కి అనుకున్న రేంజ్ లో హిట్స్ పడలేదు…అలాంటి టైంలో ఎవ్వరూ ఊహించని విధంగా స్త్రీ2 మూవీ ఊహకందని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసి ఎపిక్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి అంచనాలు ఉన్న మూవీస్ లో…

బాలీవుడ్ లో భారీగా పాపులర్ అయిన సింగం సిరీస్ లో భాగంగా భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న సింగం అగైన్(Singham Again) సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి…అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికా పదుకునే, అర్జున్ కపూర్ లాంటి…

భారీ స్టార్ కాస్ట్ తో సినిమా రూపొందుతూ ఉండగా ఈ దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కాగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఏ ట్రైలర్ కి లేనంత లెంత్ తో ఏకంగా 5 నిమిషాల భారీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…

ఆల్ మోస్ట్ సినిమా స్టోరీ పాయింట్ ను కూడా ట్రైలర్ లోనే చెప్పేశారు…రామాయాణాన్ని ఇన్ స్పైర్ గా తీసుకుని కథని మలిచారు సినిమాలో…. పెళ్లి చేసుకుని సెటిల్ అయిన అజయ్ దేవగన్ తన వైఫ్ కరీనాకపూర్ మరియు కొడుకుతో హ్యాప్పీగా ఉండగా…

కరీనాకపూర్ ని రావణాసురుడు లాంటి అర్జున్ కపూర్ ఎత్తుకెళ్ళడంతో, రాముడి లాంటి సింగం తన పోలిస్ గ్యాంగ్ హెల్ప్ తో ఎలా తన భార్యని కాపాడుకున్నాడు అన్నది స్టోరీ పాయింట్ గా సింగం అగైన్ లో చూపించబోతున్నారు….కథ పాయింట్ చాలా నార్మల్ గానే అనిపించినా కూడా…

రామాయాణాన్ని గుర్తు చేయడం, అందరు స్టార్స్ కలిసి నటిస్తూ ఉండటంతో కథ ఎలా ఉన్నా అందరినీ కలిసి చూడటం మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. సినిమా కూడా ఇదే రేంజ్ లో మెప్పిస్తే సింగం అగైన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here