Home న్యూస్ ఒకే టాక్…కానీ ఇక్కడ విజయ్ మీద రజినీదే పైచేయి!!

ఒకే టాక్…కానీ ఇక్కడ విజయ్ మీద రజినీదే పైచేయి!!

0

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది…రీసెంట్ గా కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(The Greatest Of All Time) మూవీ కూడా రిలీజ్ అయిన తర్వాత…

ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకోగా రెండు సినిమాల కలెక్షన్స్ పరంగా మాత్రం భారీ తేడా ఉంది. ఒకప్పటి రజినీ ఫామ్ ను మరిపిస్తూ విజయ్ గోట్ మూవీ తో లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని దాటేలా చేసుకున్నాడు.

The Greatest Of All Time 25 Days Total WW Collections!!

కానీ రజినీ వేట్టయన్ మంచి స్టార్ట్ తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయింది. తమిళనాడు లో గోట్ ఆల్ మోస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తోనే సొంతం చేసుకుంది… అదే టైంలో వేట్టయన్ ఇంకా 100 కోట్ల మార్క్ ని కూడా అందుకోవడానికి కష్టపడుతూ ఉంది…

కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వేట్టయన్ మూవీ మిక్సుడ్ టాక్ తో కూడా భారీ పోటిలో మంచి కలెక్షన్స్ నే అందుకుంది. విజయ్ మూవీస్ రీసెంట్ టైంలో తెలుగులో అంచనాలను మించి దుమ్ము లేపుతున్నా కూడా రజినీకి ఇక్కడ ఉన్న స్టార్ పవర్ ఏమాత్రం తగ్గలేదు అని…

ఈ సినిమా కలెక్షన్స్ నిరూపించాయి.. ఆల్ మోస్ట్ 20 కోట్లకు పైగా గ్రాస్ ను వేట్టయన్ భారీ పోటిలో అందుకుంటే గోట్ మూవీ సోలో రిలీజ్ లో కేవలం 13 కోట్ల రేంజ్ లోనే వసూళ్ళని మాత్రమే అందుకుంది. దాంతో తమిళనాడులో విజయ్ ఫుల్ డామినేషన్ ని చూపించినా తెలుగులో మాత్రం రజినీ తన సత్తా చాటుకున్నాడు…

Vettaiyan Movie 12 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here