బాక్స్ ఆఫీస్ దగ్గర 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ 5వ వారంలో కూడా షేర్స్ ని రాబడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల ఆవల ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది ఇప్పుడు….
ఇక సినిమా మిగిలిన చోట్లతో పోల్చితే కేరళ ఏరియాలో ముందుగానే పరుగును పూర్తి చేసుకుంది సినిమా…కేరళ ఏరియాలో సినిమా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ 1 కోటి రేంజ్ లో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేరళలో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా..
ఓపెనింగ్స్ ను అందుకున్నా పెద్దగా లాంగ్ రన్ ను అయితే సొంతం చేసుకోలేక పోయింది…మొత్తం మీద సినిమా కేరళలో రన్ కంప్లీట్ అయ్యే టైంకి 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ దాకా వసూళ్ళని సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేరళలో టోటల్ రన్ లో షేర్ 97 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుని వాల్యూ బిజినెస్ లో 97% వరకు రికవరీని సొంతం చేసుకున్న సినిమా సెమీ హిట్ గా నిలిచింది అక్కడ…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేరళలో…
టాక్ కొంచం బెటర్ గా వచ్చి ఉన్నా కూడా ఇంకా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది….ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న మిక్సుడ్ టాక్ తో కూడా డీసెంట్ రికవరీనే అక్కడ సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించిన దేవర ఎన్టీఆర్ కి ఇప్పుడిప్పుడే అక్కడ కూడా మార్కెట్ ఏర్పడేలా చేస్తుంది. ఇక అప్ కమింగ్ మూవీస్ తో అక్కడ ఎన్టీఆర్ మూవీస్ కి రెస్పాన్స్ ఎలా సొంతం అవుతుందో చూడాలి.