థ్రిల్లర్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేసే ఇండస్ట్రీ మలయాళ ఇండస్ట్రీ…ఎప్పటి కప్పుడు మంచి మంచి థ్రిల్లర్ మూవీస్ ని అందిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మలయాళ ఇండస్ట్రీ నుండి దృశ్యం లాంటి మరో ఎక్స్ లెంట్ థ్రిల్లర్ రీసెంట్ గా రిలీజ్ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది….
ఆ సినిమానే… కిష్కింద కాండం(Kishkindha Kaandam Movie) సినిమా మొదటి రోజు 75 లక్షల గ్రాస్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా బాక్స్ అఫీస్ ప్రయాణం టోటల్ రన్ లో 76 కోట్ల గ్రాస్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా…
రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అన్ని సౌత్ భాషల డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ కి వస్తే….తన మొదటి భార్య చనిపోవడం కొడుకు తప్పిపోయిన తర్వాత హీరో ఫ్యామిలీ బలవంతం వలన మరో పెళ్లి చేసుకుంటాడు…
ఇద్దరూ తమ ఇంటికి వచ్చిన తర్వాత హీరోకి ఒక ఫాదర్ మాత్రమే ఉండగా హీరోయిన్ ఆ ఇంట్లో అన్నీ అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంటాయి. హీరో తండ్రి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు…ఈ క్రమంలో తన కొడుకు గురించి అప్పుడప్పుడు బ్రతికే ఉన్నాడని ఆశించేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి కానీ…
Kishkindha Kaandam(2024) Movie Telugu Review
అవేవి నిజం కావు…ఈ క్రమంలో హీరోయిన్ కి హీరో తండ్రి ప్రవర్తన పట్ల అనుమానం మొదలు అవుతుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. ముందుగా ఈ సినిమా చూసే క్రమంలో మొదటి అర్ధభాగం వరకు…
కథ చాలా నత్తనడకనసాగుతుంది….ఇంత స్లోగా ఉంది ఈ సినిమాకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి అన్న అనుమానం కూడా కలుగుతుంది, సెకెండ్ ఆఫ్ మొదలు అయిన తర్వాత మెల్లి మెల్లిగా ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ డైరెక్టర్ క్లైమాక్స్ పోర్షన్ 20 నిమిషాలు తన టాలెంట్ చూపించాడు..
యాక్టర్స్ అందరూ కూడా ఆ 20 నిమిషాల ఎపిసోడ్ లో ఎక్స్ లెంట్ గా నటించారు….ఆ 20 నిమిషాల ఎపిసోడ్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం కొరియన్ సిరీస్(మౌస్) నుండి ఇన్ స్పైర్ అయినట్లు అనిపించినా బాగా సెట్ అయ్యింది…ఓవరాల్ గా ఎండ్ అవ్వడం మంచి ఫీలింగ్ తోనే ఎండ్ అవుతూ ఒక ప్రశ్నతో సినిమా ముగుస్తుంది…
సినిమా స్టార్టింగ్ లో ఉన్న నెగటివ్ ఇంప్రెషన్ సినిమా సాగుతున్న కొద్ది మారుతూ ఎండ్ కి వచ్చే సరికి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగేలా చేస్తుంది…కానీ కొంచం కొంచం ఓపిక చేసుకుని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది…. ఓవరాల్ గా రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటి అనిపించేలా ఉంటుంది ఈ సినిమా…