సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల్లో 1300 కోట్ల మార్క్ ని అందుకోగా 1400 కోట్ల గ్రాస్ మార్క్ ని సినిమా అందుకోవడానికి మరో….
3 రోజుల టైం పట్టగా మేజర్ కలెక్షన్స్ ఇందులో కూడా హిందీ నుండే సొంతం అవ్వడం సినిమా ఏ రేంజ్ లో అక్కడ జోరు చూపిస్తుంది అన్న దానికి నిదర్శనం అని చెప్పాలి. ఈ క్రమంలో సినిమా ఇండియన్ మూవీస్ పరంగా ఫాస్టెస్ట్ రికార్డులతో విరుచుకు పడగా ఇప్పుడు…
14 రోజుల్లోనే ఓవరాల్ గా 1400 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుని ఎపిక్ ఫాస్టెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అని చెప్పాలి. ఇది వరకు ఈ రికార్డ్ ఎపిక్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అయిన బాహుబలి2 సినిమా పేరిట ఉండేది…ఆ సినిమా ఆల్ మోస్ట్…
18వ రోజు ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్ గా 1400 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది….1300 కోట్ల మార్క్ ని అందుకోవడానికి బాహుబలి2 కి 16 రోజుల టైం పట్టగా 1400 కోట్ల మార్క్ ని సినిమా 18వ రోజు కలెక్షన్స్ తోనే అందుకుని మాస్ రచ్చ చేసింది…
అదే టైంలో 2 వారాల టైంకే పుష్ప2 మూవీ ఓవరాల్ గా 1400 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి ఇండియన్ మూవీస్ లో ట్రేడ్ లెక్కల్లో ఫాస్టెస్ట్ 1400 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమాగా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…
మొత్తం మీద 18 రోజుల్లో యావరేజ్ గా బాహుబలి2 మూవీ రోజుకి 77.78 కోట్ల గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు ఆల్ మోస్ట్ 14 రోజులకు ప్రతీ రోజు యావరేజ్ గా పుష్ప2 మూవీ 100 కోట్ల గ్రాస్ తో దుమ్ము దుమారం లేపింది…ఇక 1500 కోట్ల మమ్మోత్ మార్క్ ని అందుకోవడానికి ఎంత టైం తీసుకుంటుందో చూడాలి ఇప్పుడు.