బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా మరోసారి అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉంది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజున ఫుల్ వర్కింగ్ డే లో మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో జోరు చూపించి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గానే ట్రెండ్ ను చూపించింది. సినిమా 15వ రోజు తెలుగు రాష్ట్రలలో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే…
సినిమా ఓవరాల్ గా గ్రోత్ ని చూపించి 1.61 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది….మొత్తం మీద టాలీవుడ్ లో 15వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…
ఒకసారి టాలీవుడ్ లో 15వ రోజున హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే…
AP-TG 15th Day Highest Share Movies
👉#HanuMan – 5.33CR
👉#AlaVaikunthapurramuloo – 3.73Cr
👉#Baahubali2 – 2.95Cr
👉#F2 – 2.85Cr
👉#RRRMovie – 1.75CR
👉#Devara Part1 – 1.64Cr
👉#kantara – 1.63Cr
👉#Pushpa2TheRule – 1.61Cr*****
👉#SarileruNeekevvaru – 1.38Cr
👉#Krack – 1.22Cr
👉#Karthikeya2 – 1.21Cr
👉#Baahubali – 1.13Cr
👉#Rangasthalam – 0.96Cr
మొత్తం మీద 15వ రోజున టాప్ కలెక్షన్స్ మూవీస్ పరంగా హనుమాన్ మూవీ ఊహకందని ఇండస్ట్రీ రికార్డ్ తో సంచలనం సృష్టించింది….ఈ రికార్డ్ ను అందుకోవాలి అంటే మంచి పాజిటివ్ టాక్ తో పాటు సూపర్ సాలిడ్ హాలిడే కూడా అవసరం అని చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో ఏ సినిమా ఈ రికార్డ్ ను అందుకుంటుందో చూడాలి.