బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)తో తన సత్తా చాటుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా రెండేళ్ళ క్రితం ఊరు పేరు భైరవకోనతో డీసెంట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా కూడా…
తను అనుకున్న రేంజ్ కి సినిమా వెల్లలేక పోయింది. కానీ ఇప్పుడు మజాకా సినిమా మాత్రం ఆల్ రెడీ డీసెంట్ బజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా బిజినెస్ పరంగా కూడా మంచి జోరు నే చూపించగా…అన్ సీజన్ లో ఎక్స్ లెంట్ రేటుని సొంతం చేసుకోగా…
అది ఇప్పుడు తన కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఇది వరకు ఊరు పేరు భైరవకోన సినిమా 10.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా ఇప్పుడు మజాకా మూవీ ఆ రేటుని బీట్ చేసి 10.5 కోట్ల రేటుతో తన కెరీర్ బెస్ట్ బిజినెస్ ను అందుకుంది..
ఒకసారి సందీప్ కిషన్ నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Sundeep Kishan Recent Movies Pre Release Business
👉#Mazaka – 10.50CR
👉#OoruPeruBhairavakona – 10.20CR
👉#Michael – 6.50CR
👉#GullyRowdy – 2.75Cr
👉#A1Express – 4.60Cr
మొత్తం మీద రీసెంట్ టైంలో సినిమా సినిమా కి తన రేంజ్ ని మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళుతున్న సందీప్ కిషన్ ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల బిజినెస్ లెక్కలు 34.55 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకున్నాడు…యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇప్పుడు…
6.9 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటున్నాడు అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మజాకా తో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది కానీ సినిమా కి డీసెంట్ టాక్ చాలా అవసరం అని చెప్పాలి. టాక్ వస్తే సినిమా మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉంది.