బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమా మొదటి వీకెండ్ లోనే తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా నాలుగో రోజు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా కంప్లీట్ గా వైట్ వాష్ అయింది అని చెప్పాలి ఇప్పుడు…
సినిమాకి చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకున్న 4వ రోజున ఆల్ మోస్ట్ షేర్ ఏమి రాలేదు అనే చెప్పాలి….డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా చెప్పాలి అంటే పట్టుమని 10 లక్షల లోపే గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…
పెద్దగా షేర్ ఏమి సాధించలేదు అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తి అయ్యే టైంకి 92 లక్షల రేంజ్ లో షేర్ ని 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.17 కోట్ల రేంజ్ లో షేర్ ని…
2.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని మాత్రమే అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది… ఓవరాల్ గా సినిమా దారుణంగా విఫలం అయ్యి 4వ రోజున ఆల్ మోస్ట్ రక్తకన్నీరు ని తలపించేలా నిరాశ పరిచింది. ఓవరాల్ గా 12 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…
బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 10 కోట్లకు పైగానే షేర్ ని అందుకోవాల్సి ఉండగా…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశమే లేదు కాబట్టి క లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరంకి భారీ లెవల్ లో నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం అయ్యేలా చేసింది అని చెప్పాలి.