నాచురల్ స్టార్ నాని కెరీర్ ఒక ఏడాది క్రితం వరకు ఓ రేంజ్ లో కొనసాగింది, వరుస విజయాలతో ఒకటి కి మించి ఒకటి విజయాలను అందుకుంటూ దూసుకు పోయిన నాని నేను లోకల్, MCA లాంటి సినిమా లతో మాస్ లో మరింత గా జోచ్చుకు పోయాడు. ఇక నాని మరో స్టెప్ ముందుకు వేయడం ఖాయం అనుకున్న సమయం లో వరుస ఫ్లాఫ్స్ పడ్డాయి. లాస్ట్ ఇయర్ రెండు సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని.
సమ్మర్ లో కృష్ణార్జున యుద్ధం తో రాగా సెకెండ్ ఆఫ్ లో దేవదాస్ అంటూ నాగార్జున తో కలిసి వచ్చాడు. కానీ రెండు సినిమాలు పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ని అందుకోలేక చతికిల బడ్డాయి. ఇక ఇప్పుడు నాని…
2019 లో జెర్సీ అంటూ క్రికెట్ నేపధ్యంలో ఎక్స్ పెరిమెంటల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమా పై ఇప్పటికే అంతటా మంచి బజ్ నెలకొంది అని చెప్పాలి. దాంతో రెండు ఫ్లాఫ్స్ పడ్డా కానీ ఈ సినిమా కి అన్ని చోట్లా బిజినెస్ అద్బుతంగా జరిగింది అని చెప్పొచ్చు.
నైజాం లో 8 కోట్లు, సీడెడ్ లో 4.5 కోట్లు, ఆంధ్రా లో 11 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ ని సొంతం చేసుకోగా రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 23.5 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ జరిగింది, ఇక మిగిలిన చోట్ల ప్రస్తుతానికి బిజినెస్ రేంజ్ 4 కోట్ల వరకు ఉందట.
దాంతో టోటల్ గా బిజినెస్ ప్రస్తుతానికి 27.5 కోట్ల రేంజ్ లో ఉండగా నిర్మాతలు అఫీషియల్ గా రిలీజ్ చేసే బిజినెస్ మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ సినిమా తో నాని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం.