బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ భారత్, ప్రతీ ఇయర్ రంజాన్ కి తన మూవీ ఉండేలా చూసుకునే సల్మాన్ కి అన్ని హిట్లే వచ్చాయి, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుండి వరుస ఫ్లాఫ్స్ ఎదురు అయ్యాయి. ఇలాంటి సమయం లో తనకి సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో భారత్ అంటూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు సల్మాన్, మరి ఈ సినిమా తో సల్మాన్ హిట్ కొట్టాడో లేదో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ విషయానికి వస్తే ఇండియా కి స్వాతంత్ర్యమ్ వచ్చిన సమయం లో ఇండియా ఎలా ఎదిగిందో ఒక వ్యక్తీ ఎలా ఎదిగాడో దశల వారిగా చెప్పిన కథనే భారత్. యంగ్ ఏజ్ లో సర్కస్ ఫీట్స్ చేసే హీరో తర్వాత చిన్న పల్లలకి తప్పు దోవ పట్టిస్తున్నాను అనుకుని ఆ జాబ్ వదిలి వేయడం తర్వాత అనేక జాబ్స్ లో చేరడం చివరికి తన గమ్యం ఎలా చేరాడు అన్నది ఓవరాల్ సినిమా..
సినిమా పాయింట్ లో అనేక దశలు ఉండగా చాలా వరకు సీన్స్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి.. ముఖ్యంగా సల్మాన్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా కత్రినా కూడా ఆకట్టుకుంటుంది, మిగిలిన రోల్స్ లో దిశా పటాని మరియు సునీల్ గ్రోవర్స్ ఆకట్టుకుంటారు. సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. 3 పాటలు కుమ్మేశాయి.
ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది, ముఖ్యంగా స్లో నరేషన్ అవ్వడం తో సెకెండ్ ఆఫ్ బోర్ కొడుతుంది, డైరెక్షన్ పరంగా అలీ అబ్బాస్ జాఫర్ చేసిన సినిమాల్లో స్లో నరేషన్ ఉన్న సినిమా ఇదే, అయినా కానీ చాలా వరకు సినిమాను ప్రేక్షకుల మెప్పు పొందేలా తీయడం తో కొన్ని లోపాలు ఉన్నా కానీ..
మొత్తం మీద ఒక మంచి సినిమా చూశాం అన్న భావన తోనే థియేటర్స్ నుండి ఆడియన్స్ బయటికి వస్తారు. ఇమాత్రం టాక్ సల్మాన్ సినిమా కి సరిపోతుంది అని చెప్పాలి. పైపెచ్చు గత రెండు రంజాన్ మూవీస్ కన్నా భారత్ ఎన్నో రెట్లు బాగున్న సినిమా అని చెప్పొచ్చు. ఫైనల్ గా మేం సినిమా కి ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సల్మాన్ దంచి కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.