Home న్యూస్ సామి శిఖరం…ఈ రికార్డ్ కొట్టిన ఒకేఒక్కడు!

సామి శిఖరం…ఈ రికార్డ్ కొట్టిన ఒకేఒక్కడు!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతం సృష్టించాడు. లేటెస్ట్ సెన్సేషన్ మహర్షి అద్బుతమైన కలెక్షన్స్ తో దూసుకు పోతుండగా సినిమా నాలుగు వారల లోపే బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. మహేష్ బాబు కెరీర్ లో రెండో సారి 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమా గా మహర్షి సినిమా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

ఇది వరకు భరత్ అనే నేను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించే కలెక్షన్స్ ని సాధించినా…. క్లియర్ గా ఎంత దూరం వెళ్ళింది అనేది మాత్రం ఎవ్వరికీ పక్కా గా తెలియదు. దానికి కారణం నిర్మాతలు సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ రిలీజ్ చేయకుండా పోస్టర్స్ తో హడావుడి చేసి షేర్ చెప్పలేదు. దాంతో ట్రేడ్ లో ఒక్కొక్కరు ఒక్కో లెక్కలు వేయగా…

మా లెక్క ప్రకారం సినిమా 101 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు మహర్షి సినిమా ఆ మార్క్ ని క్రాస్ చేసి మహేష్ కెరీర్ లో రెండో 100 కోట్ల సినిమా గా అది కూడా వరుసగా అందుకుని రికార్డుల కెక్కింది. లాంగ్ రన్ లో మరో 2 – 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నయాని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here