హృదయ కాలేయం సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న సంపూర్నేష్ బాహు మళ్ళీ ఆ టీం తోనే కలిసి చేసిన సినిమా కొబ్బరిమట్ట, టీసర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్ని ఆకట్టుకోగా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ తో రన్ అవుతుంది, కాగా సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ.. కథ పాయింట్ మూడు జనరేషన్స్ కి సంభందించిన ఫ్యామిలీ స్టొరీ…
పాపా రాయుడు, పెదరాయుడు మరియు ఆండ్రాయిడు గా సంపూర్నేష్ ఈ సినిమాలో అదరగొట్టేశాడు. కథ పాయింట్ చెబితే చూసే వారికి థ్రిల్ మిస్ అవుతుంది కాబట్టి ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. కానీ ఇది స్పూఫ్ సినిమా అని ముందే ప్రిపేర్ అయ్యి థియేటర్స్ కి వెళితే…
2 గంటల లోపు రన్ టైం ఉన్న కొబ్బరి మట్ట సినిమా చాలా వరకు ఆకట్టుకుని ప్రేక్షకుల మనసు గెలుచుకునే సినిమా, ప్రతీ సీన్ లోను కొంచం అతి కనిపించినా కానీ అది నవ్వులు పూయించడానికే అవ్వడం తో ప్రేక్షకులు అలా ప్రిపేర్ అయి వెళితే సంపూర్నేష్ నటన, డైలాగ్స్, డాన్స్ ఇలా అన్ని ఎంజాయ్ చేయోచ్చు.
పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి తగ్గ విధంగా ఉండగా మిగిలిన నటీనటులు ఆకట్టుకున్నా సంపూర్నేష్ అందరినీ డామినేట్ చేశాడు, ఎడిటింగ్ బాగుంది, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయిన ఫీలింగ్ కలిగినా అది పెద్దగా పట్టించుకునే అవకాశం ఇవ్వకుండా సంపూర్నేష్ కవర్ చేశాడు. డైరెక్షన్ బాగుంది, డైలాగ్స్ సినిమా కి బాగా ప్లస్ అయ్యాయి.
మొత్తం మీద సినిమా కథ ప్రిడిక్ట్ చేసే విధంగానే ఉన్నా కానీ 2 గంటల లోపు టైం లో ఆడియన్స్ చాలా వరకు సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… ముందే చెప్పినట్లు స్పూఫ్ సినిమా అని గుర్తు పెట్టుకుని థియేటర్ కి వెళితే నవ్వుతు తిరిగి రావొచ్చు….అలా కాదు కొత్తదనం కావాలి అనుకున్న వాళ్ళకి సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది.