ఒక సినిమా హిట్ అవ్వడానికి ఫ్లాఫ్ అవ్వాడానికి ఆ సినిమా కి వచ్చే టాక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. హిట్ టాక్ వస్తే కొన్ని సినిమాలను ఆపడం కష్టం, ఫ్లాఫ్ టాక్ వచ్చినా కొన్ని సినిమాలు భారీ వసూళ్ళని సాధించాయి. ఈ మధ్య కాలం లో ఈ రెండో పద్దతి భారీ ఎత్తున ఇంప్రూవ్ అయ్యి ఆడియన్స్ అసలు రివ్యూ లను రేటింగ్ లను పట్టించుకోకుండా సినిమాలను భారీ విజయాలను వసూళ్ళ ని వచ్చేలా చేస్తున్నారు.
రీసెంట్ టైం లో ఫస్ట్ ఆటకే భారీగా నెగటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న సినిమాలలో అజ్ఞాతవాసి, వినయ విదేయ రామ, మహర్షి ఇప్పుడు సాహో సినిమాలు నిలిచాయి. వీటిలో అజ్ఞాతవాసి మరియు వినయ విదేయ రామ సినిమాలు నెగటివ్ రివ్యూలు డిసాస్టర్ టాక్ తో కూడా…
55 కోట్ల నుండి 60 కోట్ల రేంజ్ లో వసూళ్ళ ని సాధించాయి. ఇక తర్వాత వచ్చిన మహర్షి సినిమా కి జనాల్లో టాక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా కానీ రివ్యూ లు మాత్రం 2 స్టార్ టు 2.5 స్టార్ రేంజ్ రేటింగ్ తోనే సరిపెట్టారు. అయినా సినిమా 100 కోట్ల షేర్ ని అందుకుని ఆ రేటింగ్ ఇచ్చిన వాళ్ళ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.
ఇక రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ సాహో అటు టాక్ ఇటు రేటింగ్ రెండు కూడా తీవ్రంగా నెగటివ్ గా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని భాషల్లో కలిపి 210 కోట్లకు అధిగమించాగా ఒక్క తెలుగు వర్షన్ నే తీసుకున్నా 110 కోట్లకు పైగా షేర్ ని అందుకుని నెగటివ్ టాక్ బ్యాడ్ రేటింగ్ ల విషయం లో…
హైయెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమా గా అన్ని సినిమాల రికార్డులను తిరగరాసి కొత్త రికార్డ్ ను కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. నష్టాలు గట్టిగానే వచ్చినా కానీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించడం విషయం లో మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.