లౌక్యం తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ చాణక్య బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి యావరేజ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది, కలెక్షన్స్ అయినా ఓపెనింగ్స్ రూపంలో బాగుంటాయి అనుకుంటే మొదటి రోజు కేవలం 1.1 కోట్ల షేర్ తోనే సరి పెట్టుకుంది సినిమా. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పెద్దగా జోరు చూపలేదు.
రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ లోనే షేర్ ని రాబట్టగా మొత్తం మీద రెండు రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.9 కోట్ల రేంజ్ షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది, ఇక మూడో రోజు కూడా సినిమా…
అనుకున్న రేంజ్ లో అయితే ఆకట్టుకోలేదు, రెండో రోజు తో పోల్చితే 30% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా నైట్ షోలలో కొంచం గ్రోత్ ని సాధించి మొత్తం మీద 50 లక్షల వరకు షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 56 లక్షల దాకా షేర్ ని అందుకుంది.
దాంతో మొత్తం మీద మూడు రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.45 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని మాత్రమె రాబట్టగలిగింది అని చెప్పాలి. కానీ సినిమా ను ఏకంగా 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించారు. బిజినెస్ అంత కాక పోవడం తో లాభాలు వస్తే షేర్స్ పంచాలి అన్న కండీషన్ తో సినిమా ను రిలీజ్ చేయగా…
ఇప్పుడు కొన్నవాళ్ళ కి కూడా నష్టలనే మిగిలించే దిశగా చాణక్య సినిమా కలెక్షన్స్ ప్రయాణం సాగుతుంది, ఈ రెండు రోజుల హాలిడేస్ లో సినిమా భారీ గ్రోత్ ని సాధిస్తే తప్పితే 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి సినిమా ఈ రెండు రోజుల్లో ఏదైనా అద్బుతం చేస్తుందో చూడాలి.