Home గాసిప్స్ భోలాశంకర్ డిసాస్టర్….మెహర్ రమేష్ కి మరో ఛాన్స్!!

భోలాశంకర్ డిసాస్టర్….మెహర్ రమేష్ కి మరో ఛాన్స్!!

0

టాలీవుడ్ డైరెక్టర్స్ లో అందరూ హిట్స్ ని అందుకోలేరు….కొందరు డైరెక్టర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సొంతం అవ్వదు… అలాంటి డైరెక్టర్స్ లో మెహర్ రమేష్(Mehar Ramesh) ఒకరు… కెరీర్ లో చేసిన సినిమాలు అన్నీ నిరాశ పరిచే రిజల్ట్ ను…

సొంతం చేసుకోగా 2013 టైంలో షాడో సినిమా చేసిన తర్వాత ఆల్ మోస్ట్ 10 ఏళ్ల తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో చేసిన భోలా శంకర్(Bholaa Shankar) సినిమా చేయగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను…

అందుకోలేక పోయింది…. మొదటి రోజు నుండే అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా ఓపెనింగ్స్ నుండి నిరాశ పరిచి వీకెండ్ కే చేతులు ఎత్తేసి భారీ డిసాస్టర్ గా నిలిచింది. అలాంటి డిసాస్టర్ రిజల్ట్ తర్వాత ఇక మెహర్ రమేష్ కెరీర్ ఇక తేరుకునే అవకాశమే లేదని…

అందరూ అనుకుంటూ ఉండగా లేటెస్ట్ గా మెహర్ రమేష్ కి మరో ఛాన్స్ సొంతం అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మెహర్ రమేష్ తో ఒక బడ్జెట్ మూవీ తీయాలని అనుకుంటున్నారట… సినిమా బడ్జెట్ మొత్తం మీద…

3 నుండి 4 కోట్ల లోపు పూర్తి చేయగలరా అని డైరెక్టర్ ని అడిగినట్లు తెలుస్తుంది…ఆ బడ్జెట్ లో ఓ చిన్న సినిమా తీసి కంబ్యాక్ ఇవ్వాలని మెహర్ రమేష్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు ఓకే అయ్యి మెహర్ రమేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేక ఈ వార్తలు రూమర్స్ గానే ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here