రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే అప్పట్లో ఓ రేంజ్ లో క్యూరియాసిటీ ఉండేది, హిందీ లో కొన్ని మంచి సినిమాలు తీసి తర్వాత ఫామ్ కోల్పోయిన టైం లో తిరిగి టాలీవుడ్ లో రక్త చరిత్ర సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ, తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆ రేంజ్ మూవీ ని తీయలేక పోయాడు, డిఫెరెంట్ కెమరా యాంగిల్స్ తో థియేటర్స్ లో చూస్తున్న ఆడియన్స్ ని…
ఓ రేంజ్ లో టార్చర్ చేసే సినిమాలను ఎన్నో తీసిన రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు కొంచం బెటర్ మూవీస్ తీసినా అవి ఇతర సినిమాల ఎఫెక్ట్ వలన ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు, ఇక రీసెంట్ టైం లో లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎంతో హడావుడి చేసినప్పటికీ సినిమాలో…
పస లేక ఆ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కాంట్రవర్సీ టైటిల్ తో మళ్ళీ హడావుడి చేసినా సెన్సార్ ఆగిపోయి టైటిల్ మారి ఇప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ వచ్చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే ఎలెక్షన్ కి ముందు జరిగిన కాంపెయిన్స్ తో మొదలయ్యే సినిమా… జగన్ సిఎమ్ అయిన తర్వాత వెలుగు దేశం పార్టీ ఎలా రియాక్ట్ అయింది… తర్వాత జరిగిన కొన్ని ఊహాజనిత కల్పిత కథనే ఈ సినిమా… ఫస్టాఫ్ వరకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జరిగిన అనేక సందర్బాలను గుర్తు చేస్తూ…
తీసిన సీన్స్ ఆకట్టుకోగా ఒక లీడర్ మర్డర్ మిస్టరీ తో ఇంటర్వెల్ అవుతుంది, ఫస్టాఫ్ చూసిన తర్వాత పర్వాలేదు ఆ డిఫెరెంట్ కెమెరా యాంగిల్స్ చిరాకు పెట్టినా ఉన్నంతలో కొంచం ఆకట్టుకుంది అనుకున్నా అసలు టార్చర్ సెకెండ్ ఆఫ్ లో మొదలు అవుతుంది.
ఒక సీన్ కి ఒక సీన్ కి పొంతన ఉండదు, స్లో నరేషన్, విచిత్రమైన కెమెరా యాంగిల్స్, ఇలా సినిమా మొత్తం సెకెండ్ ఆఫ్ సహనానికి పరీక్ష పెడుతుంది, అక్కడక్కడా కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా మొత్తం మీద సెకెండ్ ఆఫ్ సినిమా కి భారీ మైనస్ పాయింట్ గా నిలిచింది.
పప్పు లాంటి అబ్బాయి, చంపేస్తాడు లాంటి సాంగ్స్ విజువల్ గా ఆకట్టుకోగా, కొన్ని స్పూఫ్ లు కూడా ఉన్నంతలో కొద్ది వరకు మెప్పిస్తాయి, యాక్టర్స్ డబ్బింగ్ కరెక్ట్ గా సెట్ కాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా నాసిరకంగా ఉన్నాయి, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సెకెండ్ ఆఫ్ పూర్తిగా తేలిపోయింది.
డైరెక్షన్ కూడా చాలా ఎడిట్ లు సెన్సార్ వారు చేయడం తో అతుకుల బొంతలా అనిపిస్తుంది, మొత్తం మీద సినిమా రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఫస్టాఫ్ చూసి కొంచం నవ్వుకుని సెకెండ్ ఆఫ్ చూసి టార్చర్ అనుభవించాలి అనుకుంటే థియేటర్స్ కి వెళ్లి చూడొచ్చు.
మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ [2.25 స్టార్స్]…. ఆ డిఫెరెంట్ కెమెరా యాంగిల్స్, అండ్ నాసిరకం ప్రొడక్షన్ వాల్యూస్, స్లో నరేషన్ ని రామ్ గోపాల్ వర్మ వదిలి పెట్టనంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి.