నట సింహం నందమూరి బాలకృష్ణ కి 2019 ఇయర్ అస్సలు కలిసి రాలేదు అని క్లియర్ అయిపొయింది, ఇయర్ మొదట్లో ప్రేక్షకుల ముందుకు ఎన్నో అంచనాలు ఆశలు పెట్టుకున్న సెన్సేషనల్ ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ తో రాగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ ఆ రెండు పార్టులు….
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి అంచనాలను కూడా అందుకోలేక అత్యంత భారీ డిసాస్టర్లు అయ్యాయు. ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచిన మొదటి పార్ట్ కి మినిమమ్ 3 స్టార్ రేటింగ్ దక్కినా కానీ ప్రేక్షకుల్లో ఇసుమంత ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేక పోయింది.
ఇక మొదటి పార్ట్ మిగిలిన నష్టాలనే టార్గెట్ గా బరిలోకి దిగిన రెండో పార్ట్ అయితే కేవలం 3.8 కోట్ల షేర్ తో పరుగును ఆపేసి టాలీవుడ్ హిస్టరీ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్స్ లో ఒకటిగా చేరింది, ఇలాంటి టైం లో ఇయర్ ఎండ్ రూలర్ అంటూ కమర్షియల్ మూవీ తో వచ్చిన బాలయ్యా…
పర్వాలేదు అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమె అందుకోగా 4 వ రోజు కూడా భారీ ఎత్తున డ్రాప్స్ ని సొంతం చేసుకోవడం తో ఇక సినిమా తేరుకోవడం కష్టమని అంతా తేల్చేశారు.
దాంతో ఈ ఇయర్ బాలయ్య ఖాతాలో హాట్రిక్ ఫ్లాఫ్స్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యినట్లే అని ఇప్పటికే ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు. రూలర్ కోసం బాలయ్యా ఎంతో కష్టపడి బరువు తగ్గి డాన్సులు, స్టైల్ తో కుమ్మేసినా కథ లో దమ్ము లేకపోవడం తో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేక పోయింది సినిమా.