Home న్యూస్ ప్రతీరోజూ పండగే డే 4 కలెక్షన్స్…వీర లెవల్ భీభత్సం!!

ప్రతీరోజూ పండగే డే 4 కలెక్షన్స్…వీర లెవల్ భీభత్సం!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ తర్వాత మళ్ళీ తేరుకుని ఇప్పుడు జోరు చూపుతున్నాడు, ఇయర్ ఫస్టాఫ్ లో చిత్రలహరి తో హిట్ కొట్టిన సాయి ధరం తేజ్ ఇప్పుడు సెకెండ్ ఆఫ్ ఎండింగ్ లో ప్రతీరోజూ పండగే ఫ్యామిలీ మూవీ తో దుమ్ము లేపుతున్నాడు.

మొదటి వీకెండ్ మూడు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 4 వ రోజు వర్కింగ్ డే అవ్వడం తో మార్నింగ్ మరియు మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 30 టు 40% లోపు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు…

వచ్చే సరికి తిరిగి పుంజుకున్న సినిమా మంచి వసూళ్ళని సాధించబోతుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో నైట్ షోలకు మొత్తం మీద 10% లోపు గ్రోత్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న విధంగా ఉంటె…

సినిమా ఇప్పుడు 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ షేర్ ని మినిమమ్ అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ లెక్కలు కూడా అనుకున్నట్లు ఉంటె ఈ లెక్క 2 కోట్ల దాకా వెళ్ళే చాన్స్ ఉందని చెప్పొచ్చు. సినిమా టార్గెట్ దృశ్యా…

ఇది సెన్సేషనల్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద వర్కింగ్ డే టెస్ట్ లో సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో వీరంగం సృష్టించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here