డియర్ కామ్రేడ్ ఫ్లాఫ్ తర్వాత మళ్ళీ లవ్ స్టొరీ నే సెలెక్ట్ చేసుకున్న విజయ్ దేవరకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వచ్చేశాడు, ప్రీమియర్ షోలకి ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకు కూడా యావరేజ్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్,
కామన్ ఆడియన్స్ మరియు మాస్ ఆడియన్స్ నుండి సినిమాకి ఫైనల్ గా ఎలాంటి టాక్ లభిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ మరీ భారీ సంఖ్యలో థియేటర్స్ కి రాకపోయినా లిమిటెడ్ గా వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది సినిమా లో సీనయ్య – సువర్ణ ల కథ కి ఫ్లాట్ అయ్యారు.
అది తప్పితే మిగిలిన కథ మొత్తం ఫ్యామిలీస్ కి ఎక్కే విధంగా లేదని యూత్ కి సంభందించిన కథతో తెరకెక్కిందని, అది కనెక్ట్ కాలేదని తేల్చేశాడు, దాంతో ఫైనల్ గా వాళ్ళ నుండి సినిమా కి యావరేజ్ రేంజ్ లో టాక్ వినిపిస్తుంది. ఇక కామన్ ఆడియన్స్ నుండి…
సినిమా కి కూడా సీనయ్య – సువర్ణ కథ ఆకట్టుకున్నట్లు మిగిలిన కథ ఆకట్టుకోలేదని, ఫస్టాఫ్ లాగానే సెకెండ్ ఆఫ్ ని డీల్ చేసి ఉంటె కొంచం బెటర్ గా ఉండేదని, ముఖ్యంగా సీనయ్య – సువర్ణ మరింత పెంచి ఉంటె బాగుందని, ఫైనల్ గా యావరేజ్ లెవల్ లోనే సినిమా ఉందని చెబుతున్నారు.
ఇక ఫైనల్ గా మాస్ ఆడియన్స్ సినిమా ను పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నారు, సీనయ్య – సువర్ణ కొంచం ఆకట్టుకుందని, మిగిలిన కథ ఏమాత్రం మెప్పించలేదని మొత్తం మీద బిలో యావరేజ్ గా ఉందని వారు చెబుతున్నారు. టోటల్ గా రోజు మొత్తం మీద అందరి రెస్పాన్స్ ని బట్టి సినిమా యావరేజ్ రేంజ్ టాక్ ని కన్ఫాం చేసుకుంది, డియర్ కామ్రేడ్ కూడా ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది, ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఆల్ మోస్ట్ ఇలాంటి టాక్ నే సొంతం చేసుకుంది.