Home న్యూస్ మమ్మోత్ దసరా ఔట్….టిల్లు స్క్వేర్ ఇక కొట్టాల్సిన శిఖరం ఈ సినిమానే!

మమ్మోత్ దసరా ఔట్….టిల్లు స్క్వేర్ ఇక కొట్టాల్సిన శిఖరం ఈ సినిమానే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పటి నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) రెండు వారాలను సూపర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మూడో వీక్ లో అడుగు పెట్టగా సూపర్ స్టడీగా దూసుకు పోతున్న ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మీడియం రేంజ్ మూవీస్ లో భారీ….

కలెక్షన్స్ ని అందుకున్న ఒక్కో సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ని క్రాస్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా ఉప్పెన(Uppena) కార్తికేయ2(Karthikeya2) లాంటి సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని క్రాస్ చేసి 60 కోట్ల క్లబ్ లో చేరగా సినిమా 15 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు మీడియం రేంజ్ మూవీస్ లో…

టాప్ 2 బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన ఊరమాస్ మూవీ దసరా(Dasara Movie) టోటల్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. దసరా మూవీ టోటల్ రన్ లో 63.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 64 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన టిల్లు స్క్వేర్ మూవీ గ్రాస్ పరంగా దసరా కన్నా కొంచం వెనుకే ఉన్నప్పటికీ…

కేవలం తెలుగు వర్షన్ తోనే ఈ సినిమా సంచలన కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం. ఇక మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను 6 ఏళ్ల క్రితం సొంతం చేసుకున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన గీత గోవిందం(Geetha Govindam) మూవీ…

కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…ఆ సినిమా టోటల్ రన్ లో 70 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది.. ఇక టిల్లు స్క్వేర్ మూవీ కి సమ్మర్ లో పెద్దగా పోటి ఏమి లేక పోవడంతో లాంగ్ రన్ ని ఇలానే కొనసాగిస్తే సినిమా 6 ఏళ్ళుగా ఎవ్వరూ టచ్ చేయని శిఖరం లాంటి గీత గోవిందంని అందుకునే అవకాశం ఉంది…

Tillu Square 2 Weeks(14 Days) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here