Home న్యూస్ ఈ రికార్డ్ కొట్టే సినిమానే లేదు….విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్!

ఈ రికార్డ్ కొట్టే సినిమానే లేదు….విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకోగా అతి తక్కువ టైంలో మీడియం రేంజ్ హీరోలలో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా మారాడు, టాప్ స్టార్స్ లో ఒకడిగా చేరడానికి ఒకటి రెండు సాలిడ్ హిట్స్ అవసరం ఉన్న టైంలో వరుస ఫ్లాఫ్స్ ను ఫేస్ చేస్తున్న విజయ్ దేవరకొండ లాస్ట్ ఇయర్ లైగర్ సినిమాతో…

భారీగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇలాంటి టైంలో ఇప్పుడు సమంతతో కలిసి ఖుషి సినిమాతో త్వరలో రాబోతున్న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు… పెళ్లి చూపులు సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి, అర్జున్ రెడ్డి యూత్ లో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకుని…

LIGER 5 Days Total World Wide Collections!!

క్లాస్ మూవీ గీత గోవిందంతో ఎపిక్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత మళ్ళీ అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ కెరీర్ లో గీత గోవిందం సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు… మీడియం రేంజ్ మూవీస్ లో…ఆల్ టైం ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది…

15 కోట్ల బిజినెస్ మీద 55.43 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది. ఈ రికార్డ్ ను ఇప్పట్లో ఏ మీడియం రేంజ్ మూవీ బ్రేక్ చేసే అవకాశం లేదనే చెప్పాలి. ఇక లాస్ పరంగా కూడా విజయ్ దేవరకొండ లైగర్ మూవీ 90 కోట్ల టార్గెట్ కి 61.8 కోట్ల లాస్ ను అందుకుని మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం ఎపిక్ లాస్ ను అందుకుంది. ఇలా అటు లాభాల పరంగా ఇటు నష్టాల పరంగా 2 ఎపిక్ రికార్డులను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తన అప్ కమింగ్ మూవీస్ తో సాలిడ్ హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నాం.

LIGER 4 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here